Main Menu

Palumaaru Dhsaroopamulu Dharinchithi Veala (పలుమాఱు దశరూప ములు దరించితి వేల)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. పలుమాఱు దశరూప – ములు దరించితి వేల?
యేకరూపము బొంద – వేల నీవు?
నయమున క్షీరాబ్ధి – నడుమ జేరితి వేల?
రత్నకాంచన మంది – రములు లేవె?
పన్నగేంద్రునిమీద – బవ్వళించితి వేల?
జలతారుపట్టెమం – చములు లేవె?
ఱెక్కలు గలపక్షి – నెక్కసాగితి వేల?
గజతురంగాందోళి – కములు లేవె?

తే. వనజలోచన | యిటువంటి – వైభవములు
సొగసుగా నీకు దోచెనో – సుందరాంగ?
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ క్షీరాబ్దిశయనా!నరసింహస్వామీ!నీవు పలుమార్లు దశావతారములు నేల ధరింతువు?ఒక్క రూపమున మమ్ములను వేడుక జేయలేవా?తండ్రీ!బంగారు కుడ్యముల రత్నమందిరమున నుండక మెల్లగా పాలకడలి నడుమ సర్పరాజును చేరితివేమి?జలతారు పట్టెమంచములు లేవా?శేషునిపై పవ్వళించితి.ఏనుగులు ,గుఱ్ఱములువంటి తూగుటుయ్యాలలు లేవా?పక్షినధిరోహించి చరించుచుంటివి.ఓ వనజలోచనుడా!యిటువంటి వైభవములన్నియూ నీకు సొగసనిపించలేదా!ఓ సుందరాంగ!
.


Poem:
See. Palumaarxu Dasaroopa – Mulu Darimchiti Vela?
Yekaroopamu Bomda – Vela Neevu?
Nayamuna Ksheeraabdhi – Naduma Jeriti Vela?
Ratnakaamchana Mamdi – Ramulu Leve?
Pannagemdrunimeeda – Bavvalimchiti Vela?
Jalataarupattemam – Chamulu Leve?
Rxekkalu Galapakshi – Nekkasaagiti Vela?
Gajaturamgaamdoli – Kamulu Leve?

Te. Vanajalochana | Yituvamti – Vaibhavamulu
Sogasugaa Neeku Docheno – Sumdaraamga?
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. palumaarxu daSaroopa – mulu dariMchiti vEla?
yEkaroopamu boMda – vEla neevu?
nayamuna kSheeraabdhi – naDuma jEriti vEla?
ratnakaaMchana maMdi – ramulu lEve?
pannagEMdrunimeeda – bavvaLiMchiti vEla?
jalataarupaTTemaM – chamulu lEve?
rxekkalu galapakShi – nekkasaagiti vEla?
gajaturaMgaaMdOLi – kamulu lEve?

tE. vanajalOchana | yiTuvaMTi – vaibhavamulu
sogasugaa neeku dOchenO – suMdaraaMga?
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.