Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
|| పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత | పడమరలి నవ్వీనె పెండ్లి కూతురు ||
Charanams
|| పేరుకల జవరాలె పెండ్లి కూతురు పెద్ద | పేరుల ముత్యాల మేడ పెండ్లి కూతురు |
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు | పేరుకుచ్చు సిగ్గువడీ బెండ్లి కూతురు ||
|| బిరుదు పెండము వెట్టె బెండ్లి కూతురు నెర | బిరుదు మగని కంటె బెండ్లి కూతురు |
పిరిదూరి నప్పుడే పెండ్లి కూతురూ పతి | బెరరేచీ నిదివో పెండ్లి కూతురు ||
|| పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడె | పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు |
గట్టిగ వేంకటపతి కౌగిటను | పెట్టిన నిధానమయిన పెండ్లి కూతురు ||
.
Is it pendlikooturu or pellikooturu