Main Menu

Prahalladhu Depati Paidi Kaanuka Licche (ప్రహ్లాదు డేపాటి పైడి కానుక లిచ్చె)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. ప్రహ్లాదు డేపాటి – పైడి కానుక లిచ్చె?
మదగజం బెన్నిచ్చె – మౌక్తికములు?
నారదుం డెన్నిచ్చె – నగలు రత్నంబు? ల
హల్య నీ కే యగ్ర – హార మిచ్చె?
ఉడుత నీ కేపాటి – యూడిగంబులు చేసె?
ఘనవిభీషణు డేమి – కట్న మిచ్చె?
పంచపాండవు లేమి – లంచ మిచ్చిరి నీకు?
ద్రౌపది నీ కెంత – ద్రవ్య మిచ్చె?

తే. నీకు వీరంద ఱయినట్లు – నేను గాన?
యెందు కని నన్ను రక్షింప – విందువదన |
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ ఇందువదన! నీ భక్తుడైన ప్రహ్లాదుడేపాటి కానుకలిచ్చాడని రక్షించితివి?గజేంద్రుడెన్ని ముత్యములొసంగెనని మోక్షము నిచ్చితివి? నారదుడెన్ని నగలు,రత్నములు ఒసంగినాడని ఆదరించితివి.అహల్య నీకు ఏ అగ్రహార మిచ్చిందని ఆదరణ చూపావు? ఉడుత నీకెంత సేవ చేసిందని కరుణ చూపావు?గొప్ప విభీషణుడు నీ కెంత కట్నమిచ్చాడని లంకారాజ్యాన్ని ధారదత్తం చేశావు? పంచపాండవులెంత లంచమిచ్చారని పక్షపాతము చూపావు? ద్రౌపది ఎంత ద్రవ్యమిచ్చెనని దయ తలిచావు?వారికిమల్లే నీ భక్తుడనే కానా?నన్నెందుకు రక్షింపవు తండ్రీ!
.


Poem:
See. Prahlaadu Depaati – Paidi Kaanuka Lichche?
Madagajam Bennichche – Mauktikamulu?
Naaradum Dennichche – Nagalu Ratnambu? La
Halya Nee Ke Yagra – Haara Michche?
Uduta Nee Kepaati – Yoodigambulu Chese?
Ghanavibheeshanu Demi – Katna Michche?
Pamchapaamdavu Lemi – Lamcha Michchiri Neeku?
Draupadi Nee Kemta – Dravya Michche?

Te. Neeku Veeramda Rxayinatlu – Nenu Gaana?
Yemdu Kani Nannu Rakshimpa – Vimduvadana |
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. prahlaadu DEpaaTi – paiDi kaanuka lichche?
madagajaM bennichche – mauktikamulu?
naaraduM Dennichche – nagalu ratnaMbu? la
halya nee kE yagra – haara michche?
uDuta nee kEpaaTi – yooDigaMbulu chEse?
ghanavibheeShaNu DEmi – kaTna michche?
paMchapaaMDavu lEmi – laMcha michchiri neeku?
draupadi nee keMta – dravya michche?

tE. neeku veeraMda rxayinaTlu – nEnu gaana?
yeMdu kani nannu rakShiMpa – viMduvadana |
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.