Main Menu

Roopavati Amrtavarshini (రూపవతి అమృతవర్షిణి)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
రూపవతి! అమృతవర్షిణి!
శ్రీ పావని! చారుకేశి! శృంగారిణి! ఆ
లాపి! శివరంజని! జయ
శ్రీ! పూర్ణలతిక! సుగాత్రి! శ్రీః! బతుకమ్మా!

తాత్పర్యం:
రాగస్వరూపిణివైన ఓ బతుకమ్మా! నువ్వు చక్కని రూపం గల దానవు. భక్తులపై అమృతాన్ని కురిపించేదానవు. పరమపావనమైన మహాలక్ష్మివి. అందమైనకురులు గలదానవు. అలంకారప్రియవు. మధురమైన రాగాలాపన చేసే సరస్వతివి. పరమశివుని రంజింప చేసే పార్వతివి. విజయలక్ష్మీస్వరూపిణివి. సంపూర్ణముగా తీగసాగి చైతన్యముతో వికసించిన పూలతీగవు. (కుండలినీ చైతన్యలతవు) పువ్వువంటి సుకుమారసుందర దేహముగలదానవు. శ్రీలక్ష్మివి…

.


Poem:
Roopavati! Amrtavarshini!
Sree Paavani! Chaarukaesi! Srmgaarini! Aa
Laapi! Sivaramjani! Jaya
Sree! Poornalatika! Sugaatri! Sreeh! Batukammaa!

.


Poem:
roopavati! amRtavarshiNi!
Sree paavani! chaarukaeSi! SRMgaariNi! aa
laapi! SivaraMjani! jaya
Sree! poorNalatika! sugaatri! Sree@h! batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.