Pallavi
|| సదా సకలము సంపదలే | తుద దెలియగవలె దొలగగవలయు ||
Charanams
|| అహర్నిశలు నాపదలే | సహించిన నవి సౌఖ్యములే |
ఇహముననవి యిందరికిని | మహిమ దెలియవలె మానగవలెను ||
|| దురంతము లివి దోషములే | పరంపర లివి బంధములు |
విరసములౌ నరవిభవములౌ- | సిరులే మరులౌ చిరసుఖ మవును ||
|| గతి యలమేల్మంగ నాంచారికి | బతియగువేంకటపతి దలచి |
గతు లెరుగగవలె రవణము వలెను | హిత మెరుగగవలె నిదె తనకు ||
.
Pallavi
|| sadA sakalamu saMpadalE | tuda deliyagavale dolagagavalayu ||
Charanams
|| aharniSalu nApadalE | sahiMcina navi sauKyamulE |
ihamunanavi yiMdarikini | mahima deliyavale mAnagavalenu ||
|| duraMtamu livi dOShamulE | paraMpara livi baMdhamulu |
virasamulau naraviBavamulau- | sirulE marulau cirasuKa mavunu ||
|| gati yalamElmaMga nAMcAriki | batiyaguvEMkaTapati dalaci |
gatu lerugagavale ravaNamu valenu | hita merugagavale nide tanaku ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.