Main Menu

Sadhasathsamsayam (సదసత్సంశయం)

Sri Sri (శ్రీరంగం శ్రీనివాస రావు) popularly known as Sri Sri, was born on 2nd January 1910 in Visakhapatnam. Sri Sri completed his education in the same school in which his father Sri Venkata Ramaiah was working as a mathematics teacher. He married Ms. Venkata Ramanamma at an age of 15 and adapted a girl child. Later on he married Ms. Sarojini and was blessed with a son and two daughters.More...

Book Of Reference : Khadga Srushti

Book Published Year : 1966

Title of the Poem: Sadhasathsamsayam

Language: Telugu (తెలుగు)

 


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This lyric was originally composed in Telugu. Other languages are for your convenience



ఆలోలము లాలోచన
లేవేవో నాలోపల
ప్రాలేయచ్ఛాయలవలె
తారాడగ కోరాడగ

పేరు పేరు వరసలతో
పిలిచి ప్రశ్న వేస్తున్నా
ఈ తెగని సమస్యను భే
దించువారలెవరో అని

ఎన్నో సందేహాలూ
ఎన్నో సంతాపాలూ
జీవితంపు చిక్కుముడులు
విడవెంతగ సడలించిన

ఈ సృష్టికి ఏమర్ధం
మానవునికి గమ్యమేది
ఒక సకలాతీత శక్తి
ఉన్నట్టా లేనట్టా

నిరంతరం ఘోషించే
నీరనిధిని పిలిచినాను
ఆస్తి నాస్తి రూపమైన
ఆకాశము నడిగినాను

మహాకవుల గ్రంథాలను
మనసుపెట్టి పఠించాను
ప్రవ్రజితుల ముముక్షువుల
భావాలనే స్మరించాను

యుగయుగాలు తరలెగాని
ప్రశ్న ప్రశ్నలాగున్నది
అలలు కదిసి మరలి చనగ
శిలమాత్రం మిగిలినట్టు

జగదీశరు డతడెవరో
అగపడితే బాగుండును
ఏమీ యిది సామీ అని
నిలవేస్తా కడిగేస్తా

కవి హృదయపు కనుమలలో
గర్జించిన పర్జన్యం
పెనుచీకటి తిరుగుబాటు
బీభత్సపు మెరుపుదాడి

కనులముందు చిత్రించే
గతిలేని, జనాల బాధ
కడుపు తరుక్కొనిపోయే
కన్నీళ్ళ విషాదగాథ

కరువులలో వరదలలో
కటిక దరిద్రుల అవస్థ
కవితలోన కథలలోన
కట్టాలని తలచినపుడు

ఈ విశాల జగతినుంచి
ఏమిటి నే కోరినాను
ఒక జానెడు సానుభూతీ
ఒక దోసెడు తిరుగుబాటు

జ్ఞానులు బోధిస్తూ బ్ర
హ్మానంద మవాజ్మాధస
విశదమనీ అనుభవైక
వేద్యమనీ నుడివినారు

జపంవల్ల తపంవల్ల
ప్రపంచాన్ని మరచిపోయి
భగవంతుని ధ్యానంలో
పడిపొమ్మని పలికినారు

మంచిచెడ్డలను కొలిచే
మానదండమట దైవం
ఈశరు డొకడే సత్యం
ఇతర సమస్తం మిథ్యట

ఇంద్రియాలదారా మన
కీ సత్యం తెలియదంట
విశాసం తప్ప మనకి
వేరే సాక్ష్యం లేదట

అగుపించనిదేదో ఒక
ఆత్మ పదార్ధం కలదట
అన్నీ పోవచ్చుగాని
అది మాత్రం చావదంట

నిప్పు దాన్ని కాల్చలేదు
ఛేదించగలేదు కత్తి
నీరు దాన్ని ముంచలేదు
గాలి దాన్ని చెరపదంట

జన్మలనీ కర్మమనీ
చాలాదూరం వెళ్ళిన
ఆలోచనలన్నీ ఈ
ఆత్మచుట్టు అల్లినవే

ఏతదాత్మ సరేషాం
సరత్రా ఆవరించి
సరసం తానే ఐ
శాసిస్తుం దంట జగతి

పుణ్యపాప నిర్ణేతలు
నీత్యవినీతిజ్ఞ విజ్ఞు
లస్తి నాస్తి విచికిత్సకు
లంతమంది యేమన్నా

ఇది మాత్రం నే నెరుగుదు
నెంతమంది యేమన్నా
తథ్యం ప్రాణికి మృత్యువు
తప్పదు జీవికి వేదన

జడిగొల్పే దుఃఖంలో
తడియకుండ గొడుగులేదు
ఆనందాలన్నీ తుద
కంతమొందు నొక సమాధి

మనుజునిలో మరణ భీతి
మదిలో దుఃఖానుభూతి
ఆలోచన లన్నిటికీ
ఆంతర్యంతో పునాది

ఎవరయ్యా ఎవరువారు
ఈశర పద జిజ్ఞాసువు
లెవరయ్యా ఎవరంటా
ఇదివరలో ఎవరువారు?

ఉద్యోగపు ధర్మంలో
సద్యోం హశ్చర్యంలో
విటతాటపు బ్రతుకు గడిపి
రిటైరైన పోలీసులు.

నిత్య నిధువనక్రీడా
నృత్యంలో అలసిపోయి
జవసతా లుడిగిపోయి
సాధువైన వేశ్యామణి

నైకానోకహ విహారి
కాకంవలె దుఃఖ రాత్ర
ఘూకంవలె సంచరించు
లోక దేషాగ్ని శీలి :

ఇంకా చెప్పాలంటే
ఎందరో మహానుభావులు
బ్రతుకునించి పారిపోయి
తమ వెనుకనే దాగువారు.

మరణ మహాసముద్రాన
జీవిత మొక దీపంలా
తమపాలిటి శాపంలా
తలపోసే ఫిలోఫర్లు

ఆహా మరి యింతేనా
అందమైన మన మనుగడ
మూడునాళ్ళ వింతేనా
జగమతుకుల బొంతేనా

మెదడన్నది మనకున్నది
అది సరిగా పనిచేస్తే
విశరహ: పేటికా వి
పాటన జరగక తప్పదు.

“ప్రవక్ష్యామి గీతార్థే
న” యన్నాడు కాళిదాసు
బహుశా అంతకుమించిన
క్థోనిజమే ఉండదేమొ

ఔను – అహింసను పోలిన
పరమో ధర్మమ్ము లేదు
(పరమో ధర్మం విరువకు
పరమ – అధర్మం అంటూ)

ఈవిల్, సిన్ మొదలైన ప
దాలను వాడే టప్పుడు
న్యాయం ధర్మం నీతీ
త్యాదుల చర్చించేప్పుడు

ఎవరికి తోచిన అర్థం
వారలు చెప్పక తప్పదు
పరమార్థం సామాజిక
సామూహిక సదర్తన

కలడు కలండనెడు వాడు
కలడో లేడో అంటూ
లోగడ ఒక ఏనుగు ఆ
లోచనలో పడిందట.

హౌరా హౌరీ మకరితో
పోరి నడుం జారి తుదకు
“నాన్యధాస్తి శరణ” మనుచు
దైన్యంతో నిలిచిందట

విహల నాగేంద్రుని మొర
విని – అప్పుడు కదలెనంట
ఆపన్న జనావన బిరు
దాంచితుడైనట్టి వేల్పు

చక్రంబున నక్రంబుసు
సంహరించి ఆ పిమ్మట
స్థల జలచరు లిరువురికీ
సాయుజ్య మొసంగెనంట

ఇది జరిగిన కథ కాదని
ఎవరో కల్పించిందని
ఇంచుక యోచించ గలా
డెవడైనా గ్రహిస్తాడు.

ఆ విషయ మటుండ నిచ్చి
అసలు సంగతికి వద్దాం
ఈ గజేంద్ర మోక్షణ కథ
ఏంటి చెబుతుంది మనకు?

నీ శక్తికి విలువలేదు
నీ యత్నం పనికిరాదు
దైవబలం ఉందే అది
అమేయమూ, అజేయమూ :

అందుచేత నూరిపోయు
లొంగిపొమ్ము బేషరతుగ
అపు డాతని కృపచేత స
మస్తం సౌఖ్యాంత మగును.

పిరికితనం నూరిపోయు
పిట్ట కథలతో బానిస
మానసికత నగ్గించే
మన పూరుల నేమనాలి?

రాచరికపు రోజుల్లో
ఎగుడుదిగుడు సమాజాన
పాలక వర్గాధిక్యం
నిలబెట్టే పూనికతో

మనిషి నిలా తగ్గిస్తూ
మరోదాన్ని ఉగ్గడించి
పరమాత్ముని పేర మత
ప్రవక్తలైనారు వారు

వాళ్ళ నెందు కనడంలే
ఇది మనలో జీర్ణించిన
ముది తత్తం, ఈ సరికీ
వదలిపోని మురికి మందు


Awaiting Contribution.


Awaiting Contribution.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.