Main Menu

Samanyama valapu (సామాన్యమా వలపు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.101 ; Volume No.5

Copper Sheet No. 17

Pallavi:Samanyama valapu (సామాన్యమా వలపు)

Ragam: Sriraagam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Samanyama valapu | సామాన్యమా వలపు     
Album: Private | Voice: M.Balamurali Krishna


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

సామాన్యమా వలపు సతులుఁ బతులనుభవన-
లేమరినఁ బ్రాణంబులేరేతి నుండు

చరణములు

1.కలికి చూపులు మనసు గరఁగకెటువలె నుండు
అలయింతలను దేహమలయ కేలుండు
బులుపుఁ బిలుపుల మేను పులకించకేలుండు
మొలకనగవుల యాస మొలవకేలుండు

2.పచ్చిచూపులు కేఁడి పారకెటువలెనుండు
వెచ్చనూర్పులు మనసు వేఁచకేలుండు
మచ్చికల హ్రుదయంబు మరులు గొనకేలుండు
అచ్చలంబునఁ గాఁకలలమ కేలుండు

3.దంటమాటలఁ గూర్మి దగులకెటువలెనుండు
నంటుననౌ మోహంబు నాఁటకేలుండు
గొంటుఁజేఁతల మనసు కొల్లగొనకేలుండు
రెంటలను విరహాగ్ని రేఁచకేలుండు

4.కింకలను దమకంబు కెరలకెటువలె నుండు
జంకెనలఁ బ్రేమ కొనసాఁగ కేలుండు
వేంకటవిభుఁనిఁ గలసి వెడయలుక యేలుండు
పంకజానన వానిఁ బాసియేలుండు.
.


Pallavi

sAmAnyamA valapu satulu@m batulanuBavana-
lEmarina@m brANambulErEti numDu

Charanams

1.kaliki cUpulu manasu gara@mgakeTuvale numDu
alayimtalanu dEhamalaya kElumDu
bulupu@m bilupula mEnu pulakimcakElumDu
molakanagavula yAsa molavakElumDu

2.paccicUpulu kE@mDi pArakeTuvalenumDu
veccanUrpulu manasu vE@mcakElumDu
maccikala hrudayambu marulu gonakElumDu
accalambuna@m gA@mkalalama kElumDu

3.damTamATala@m gUrmi dagulakeTuvalenumDu
namTunanau mOhambu nA@mTakElumDu
gomTu@mjE@mtala manasu kollagonakElumDu
remTalanu virahAgni rE@mcakElumDu

4.kimkalanu damakambu keralakeTuvale numDu
jamkenala@m brEma konasA@mga kElumDu
vEmkaTaviBu@mni@m galasi veDayaluka yElumDu
pamkajAnana vAni@m bAsiyElumDu.
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.