Main Menu

Srirama namame jihvaku (శ్రీరామ నామమే జిహ్వకు)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Athana/ATDANA

Arohana :Sa Ri Ma Pa Ni Sa
Avarohana :Sa Dha Ni Pa Ni Sa

Taalam: Tisra Eka

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| శ్రీరామ నామమే జిహ్వకు స్థిరమై యున్నది యున్నది | శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమై యున్నది యున్నది ||

చరణములు

|| ఘోరమైన పాతకముల గొట్టేనన్నది మిమ్ము | చేరకుండ ఆపదల చెండే నన్నది అన్నది ||

|| దారి తెలియని యమదూతలను తరిమెనన్నది అన్నది శ్రీమన్నారాయణ దాసులైనవారికి అనువై యున్నది యున్నది ||

|| మాయావాదుల పొందిక మానమన్నది అన్నది మీ- | కాయము లస్థిరమని తలపోయుడన్నది అన్నది ||

|| బాయక గురురాయని బోధచేయుడన్నది అన్నది | ఏ యెడజూచినగాని తాను ఎడబాయకున్నది ఉన్నది ||

|| కామక్రోధ మోహాంధకారముల మానుడన్నది అన్నది | మోదముతో పరస్త్రీలపొందు మోసమన్నది అన్నది ||

|| వలదని దుర్విషయముల వాంఛ విడుడన్నది అన్నది నీ- | తలపున హరిపాద కమలములుంచ తగునని అన్నది అన్నది ||

|| కోపమనియెడి ప్రకౄతిని కొట్టుమన్నది అన్నది | యిపుడు ప్రాపు నీవేయనిన దారిచూపెద నన్నది అన్నది ||

|| ఏపుమీర నొరుల దోషము లెన్నకన్నది అన్నది | ఏ పాప బంధముల పట్టుపడవద్దని అన్నది అన్నది ||

|| భక్తిభావము తెలిసి మీరు బ్రతుకుడన్నది అన్నది పరమ- | భక్తులకు సేవసేయుచు ప్రబలుడని అన్నది అన్నది ||

|| ముక్తి మార్గమునకు యిదే మూలమన్నది అన్నది | భక్తుడు భద్రాచలరామదాసు డన్నది అన్నది ||

.


Pallavi

|| SrIrAma nAmamE jihvaku sthiramai yunnadi yunnadi | SrIrAmula karuNayE lakShmIkaramai yunnadi yunnadi ||

Charanams

|| GOramaina pAtakamula goTTEnannadi mimmu | cErakuMDa Apadala ceMDE nannadi annadi ||

|| dAri teliyani yamadUtalanu tarimenannadi annadi SrImannArAyaNa dAsulainavAriki anuvai yunnadi yunnadi ||

|| mAyAvAdula poMdika mAnamannadi annadi mI- | kAyamu lasthiramani talapOyuDannadi annadi ||

|| bAyaka gururAyani bOdhacEyuDannadi annadi | E yeDajUcinagAni tAnu eDabAyakunnadi unnadi ||

|| kAmakrOdha mOhAMdhakAramula mAnuDannadi annadi | mOdamutO parastrIlapoMdu mOsamannadi annadi ||

|| valadani durviShayamula vAMCa viDuDannadi annadi nI- | talapuna haripAda kamalamuluMca tagunani annadi annadi ||

|| kOpamaniyeDi prakRutini koTTumannadi annadi | yipuDu prApu nIvEyanina dAricUpeda nannadi annadi ||

|| EpumIra norula dOShamu lennakannadi annadi | E pApa baMdhamula paTTupaDavaddani annadi annadi ||

|| BaktiBAvamu telisi mIru bratukuDannadi annadi parama- | Baktulaku sEvasEyucu prabaluDani annadi annadi ||

|| mukti mArgamunaku yidE mUlamannadi annadi | BaktuDu BadrAcalarAmadAsu Dannadi annadi ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.