Main Menu

Sthambhamam Dhudayinchi Daanaveandhruni Dhrunchi (స్తంభమం దుదయించి దానవేంద్రుని ద్రుంచి)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. స్తంభమం దుదయించి – దానవేంద్రుని ద్రుంచి
కరుణతో బ్రహ్లాదు – గాచినావు
మకరిచే జిక్కి సా – మజము దుఃఖించంగ
గృపయుంచి వేగ ర – క్షించినావు
శరణంచు నా విభీ – షణుడు నీ చాటున
వచ్చినప్పుడె లంక – నిచ్చినావు
ఆ కుచేలుడు చేరె – డటుకు లర్పించిన
బహుసంపదల నిచ్చి – పంపినావు

తే. వారివలె నన్ను బోషింప – వశముగాదె?
యంత వలపక్ష మేల శ్రీ – కాంత | నీకు?
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరసింహస్వామీ!స్థంబమునుండి వెలువడి రాక్షసేంద్రుడైన హిరణ్యకశిపుని చంపి కరుణతో ప్రహ్లాదుని కాపాడినావు. గజేంద్రుని మొసలిబారినుండి రక్షించితివి. శరణు,శరణు కాపాడుమని వేడికొన్న విభీషణుని లంకకు రాజును చేసితివి. చేరెడటుకులు సమర్పించినంత మాత్రమునే నీ ప్రియస్నేహితుడైన కుచేలునికి అపార సిరిసంపదలిచ్చి బ్రోచినావు. వారివలె నన్నుగూడదయతో బ్రోవవేమి తండ్రీ!శ్రీకాంత! రక్షించి బ్రోవుమయ్య!నేనేమి చేసితినని ఇంత పక్షపాతము చూపిస్తున్నావు తండ్రీ!
.


Poem:
See. Stambhamam Dudayimchi – Daanavemdruni Drumchi
Karunato Brahlaadu – Gaachinaavu
Makariche Jikki Saa – Majamu Duhkhimchamga
Grupayumchi Vega Ra – Kshimchinaavu
Saranamchu Naa Vibhee – Shanudu Nee Chaatuna
Vachchinappude Lamka – Nichchinaavu
Aa Kucheludu Chere – Datuku Larpimchina
Bahusampadala Nichchi – Pampinaavu

Te. Vaarivale Nannu Boshimpa – Vasamugaade?
Yamta Valapaksha Mela Sree – Kaamta | Neeku?
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. staMbhamaM dudayiMchi – daanavEMdruni druMchi
karuNatO brahlaadu – gaachinaavu
makarichE jikki saa – majamu duHkhiMchaMga
gRupayuMchi vEga ra – kShiMchinaavu
SaraNaMchu naa vibhee – ShaNuDu nee chaaTuna
vachchinappuDe laMka – nichchinaavu
aa kuchEluDu chEre – DaTuku larpiMchina
bahusaMpadala nichchi – paMpinaavu

tE. vaarivale nannu bOShiMpa – vaSamugaade?
yaMta valapakSha mEla Sree – kaaMta | neeku?
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.