Main Menu

Tag Archives | Gollapudi Columns

Gollapudi columns ~ O Niyanta Akhari Rojulu (ఓ నియంత ఆఖరి రోజులు)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

కొన్ని లక్షల మంది మారణహోమానికి కారణమయి, ఒక శతాబ్దపు దౌష్ట్యానికి, పాశవిక ప్రవృత్తికీ కారణమయిన ఓ నియంతకి ఇంత మర్యాద అక్కరలేదు నిజానికి. ‘ఓ నియంత దిక్కుమాలిన చావు’ -అన్నా సరిపోతుంది. కాని హిట్లర్‌ చావుని పదేపదే చరిత్ర గుర్తుచేసుకునే సందర్భాలు ఎక్కువ. చాలాకాలం క్రితం -హాలీవుడ్‌ ఓ గొప్ప చిత్రాన్ని నిర్మించింది. ”హిట్లర్‌ ఆఖరి రోజులు” దాని పేరు. ప్రముఖ నటుడు ఎలెక్‌ గిన్నిస్‌ హిట్లర్‌ పాత్రని ధరించి -నటనకు ఆస్కార్‌ బహుమతిని పుచ్చుకున్న గుర్తు. […]

Continue Reading · 0

Gollapudi columns ~ Ongina Akasam (ఒంగిన ఆకాశం)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

జీవన కాలమ్: ఒక నాయకుడు- అందునా ముఖ్యమంత్రి ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా, కేవలం ఓ పసిపిల్ల ఉత్సాహానికి ఊతం ఇవ్వడానికి తన కార్యక్రమాన్ని సడలించుకుని ఇంటర్వ్యూ ఇవ్వడం ఈ దేశంలో చర్మం ముదిరిన నాయకులు చేయడం మనం వినలేదు. ఓ పదకొండేళ్ల అమ్మాయి మొన్న మహారాష్ట్రలో ముఖ్య మంత్రి పదవీ స్వీకారాన్ని చూసింది. ఆ సంఘటన ఆ అమ్మాయిని ఆకర్షించింది. ఎం దుకు? మహారాష్ట్ర చరిత్రలో జరగని విధంగా కేవలం ఉద్ధతి, నిజాయితీ, సేవాతత్పరత పెట్టు బడులుగా […]

Continue Reading · 0

Gollapudi columns ~ O Gontu- O Garjana (ఓ గొంతు – ఓ గర్జన)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

అరవై ఐదు సంవత్సరాలు కుళ్ళి, అహంకారంతో, స్వార్థంతో నేరచరిత్రతో గుండెలు దీసిన ధైర్యంతో చట్టాల్నీ, చట్టసభల్నీ కైవశం చేసుకుని దేశాన్ని దోచుకుతింటున్న పాలక వ్యవస్థలో కేవలం 9 నెలల్లో రూపు దిద్దుకుని –ప్రజల మద్దతుని సాధించి, మైనారిటీ వోటుతో మెజారిటీని నిరూపించుకోవడానికి అసెంబ్లీలో నిలబడిన- ఏనాడూ నిలబడాలని,నిలబడతానని ఊహించని ఓ సాదా సీదా నేలబారు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గొంతు విప్పితే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది.’మేము పార్టీ రాజకీయాలు నడపడానికి ఇక్కడికి రాలేదు. ఆ పని […]

Continue Reading · 0

Gollapudi columns ~ Nee Baancen, Kalmokkuta! (నీ బాంచెన్ , కాల్మొక్కుతా!)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

ఈసారి ఎన్నికలలో నన్ను గొప్పగా ఆకర్షించిన ఎడ్వర్టైజ్‌మెంట్‌ -కాంగ్రెస్‌ది. మేడమ్‌ సోనియా గాంధీ ఓ నేలబారు పల్లెటూరు ముసలమ్మని చిరునవ్వుతో కావలించుకోవడం అతి అపురూపమైన, అరుదైన సుందర దృశ్యం. నేను సినిమా నటుడిని. నా ఉద్దేశంలో ఈ పల్లెటూరి మనిషి -ఏ సినిమా నటో కావచ్చు. బహుశా ఈ ప్రకటన షూటింగ్‌ 10, జనపత్‌ రోడ్డులో మేడమ్‌కి సౌకర్యంగా ఉన్న సమయంలో జరిగి ఉండవచ్చు. ఆ నేలబారు మనిషికి నిజంగా ఆవిడ నేలబారు మనిషే అయితే ఇటలీ […]

Continue Reading · 0

Gollapudi columns ~ Napumsaka Pumsatvam..! (‘నపుంసక ‘ పుంసత్వం ..!)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

రాజకీయ సిద్ధాంతాలు, సామాజిక బాధ్యత, ప్రజా సంక్షేమం, నైతిక విలువలు వంటి పదాలు రాజకీయ రంగంలో బూతుమాటలయి ఎన్నాళ్లయింది? ఈ మధ్య ఏ నాయకులయినా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? పోనీ, అసలు ఇలాంటి మాటలకు వీరికి అర్థం తెలుసా? ముందు ముందు రాబోయే వారాలలో వీటి వెక్కిరింతని మరింతగా చూడబోతున్నాం. నేను రాజకీయ జంతువుని కాను. ఒక మామూలు కాలమిస్టుని. రాజకీయ సిద్ధాంతాలు కాక, రాజకీయ మనుగడకోసం ఇప్పుడిప్పుడు ఎంతమంది కప్పదాట్లు వేస్తున్నారో ప్రతిదినం మనం పత్రికల్లో […]

Continue Reading · 0

Gollapudi columns ~ Naadayogi Jnaanapakaalu (నాదయోగి జ్ఞానపకాలు)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

‘రేవతిరాగంలో ‘నానాటి బతుకు నాటకము’ కీర్తన బాణీని కూర్చిన ఒక్క అద్భుతానికే మీకు సంగీత కళానిధి ఇవ్వాల’’ని మురిసిపోతూ ఆయన దగ్గర ఆ పాట నేర్చుకున్నారు విదుషీమణి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి. కొందరు గొప్పతనాన్ని భుజకీర్తుల్లాగ అలంకరిం చుకుని ఊరేగుతుంటా రు. మరికొందరు మంచి నీళ్ల సెలలాగ వ్యాపించి, పలకరించిన వారికి దప్పి క తీరుస్తూ, హృదయంలో ‘చెమ్మ’ని ఆర్ద్రంగా పంచు తూ ప్రయాణం చేస్తూం టారు. అలాంటి రెండో కోవకు చెందిన మనుషుల్లో మొదటిస్థానంలో నిలిచేవారు నేదునూరి […]

Continue Reading · 0

Gollapudi columns ~ Musugullo nayakulu (ముసుగుల్లో నాయకులు)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

ఈ మధ్య షూటింగుకి రాజమండ్రికి వచ్చాను. అక్కడ ప్రతీ వీధి జంక్షన్‌లోనూ కనిపించిన దృశ్యం నాయకుల విగ్రహాల మీద ముసుగులు. మా మిత్రుడిని అడిగాను -కారణమేమిటని. ఎన్నికల నిబంధనలు -అన్నాడాయన. పాపం, మన నాయకులు -తమ ప్రచారానికి విగ్రహాల్ని ప్రతిష్టించారు. ఎన్నికల సంఘం వారి మీద ముసుగులు దించింది -ప్రతీ వీధిమొగలో వారిని చూస్తే వోటరుకి వారికి ఓటు వేయాలని అనిపిస్తుందేమోనని వారి ఆలోచన అయివుంటుంది. కాని నేనంటాను -మరో విధంగా ఆలోచిస్తే ‘వీరే మా కొంపలు […]

Continue Reading · 0

Gollapudi columns ~ Mr̥tyuhela (మృత్యుహేల)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

ఫాస్ట్ బౌలర్ 150 కి.మీ వేగంతో విసిరే బంతి సెకనులోపే 22 గజాలు ప్రయాణం చేస్తుంది. బంతి వేగానికి, మనిషి నిశిత దృష్టికి మధ్య క్షణంలో ఏర్పడిన తేడాయే హ్యూస్‌ని ఆటకూ, జీవితానికీ దూరం చేసింది. మృత్యువు ఆట. లేదా ఆటలో మృత్యువు. దాదాపు 300 ఏళ్ల కిందట ప్రముఖ బ్రిటిష్ రచయిత డేనియల్ డెఫో ‘‘మాన్ ఫ్రైడే’’ అనే నవల రాశాడు. సరిగ్గా 254 సంవత్స రాల తర్వాత ఆడ్రియన్ మిచల్ అనే నాటక రచయిత […]

Continue Reading · 0

Gollapudi columns ~ Miriyala picikari..! (మిరియాల పిచికారీ..!)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

చాలా కష్టపడి ఃపెప్పర్‌ స్ప్రేఃకి ఈ తెలుగు అనువాదం చేశాను. గత శతాబ్దంలో మన దేశానికి వచ్చిన వ్యాపారస్థులందరూ ఈ సుగంధ ద్రవ్యాలనే రవాణా చేసుకున్నారు తమ తమ దేశాలకి. మన దేశంలో మిరపకాయలు లేవు. కారం లేదు. గ్రీసు వంటి దేశాల నుంచి దరిమిలాను వచ్చాయని చెప్పుకుంటారు. మళ్లీ ఆనాటి మిరియాలకి జాతీయమైన ప్రతిష్టని ఈనాడు పెంచిన ఘనత లగడపాటి రాజగోపాల్‌గారిది. లోక్‌సభలో మైకులతో కొట్టుకోవడం చూశాం. తిట్టుకోవడం చూశాం. కాగితాలు చింపడం చూశాం. ఈ […]

Continue Reading · 0

Gollapudi columns ~ Mannci polisu – ceddapolisu (మంచి పోలీసు – చెడ్డపోలీసు)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

మీరెప్పుడైనా గమనించారో లేదో మంచి పోలీసు – చెడ్డపోలీసు చాలా సరదా అయిన ఆట. రోడ్డు మీద టోపీ లేకుండా వెళ్ళే మోటార్ సైకిల్ మనిషిని ఒక పోలీసు పట్టుకుంటాడు. నెలాఖరు రోజులు. బేరం ప్రారంభమవుతుంది. అలాక్కాక – అవతలి మనిషి ఏ మంత్రిగారి వియ్యంకుడో, ఎమ్మెల్యే గారి బావమరిదో అయితే ఈ పోలీసు ఇరుకులో పడతాడు. అప్పుడేమవుతుంది? మరో పోలీసు రంగంలోకి దూకుతాడు. ఇతను తప్పనిసరిగా మంచి పోలీసు అయివుంటాడు. రాగానే పాసింజరుకి నమస్కారం చేస్తాడు. […]

Continue Reading · 0