Main Menu

Tag Archives | Gollapudi Maruti Rao

Gollapudi columns ~ Pinnala Kosam (పిన్నలకోసం!!.)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

నేను విరివిగా సినీమాలు చేస్తున్న రోజుల్లో ఒకసారి మా ఆవిడతో ఊరు వెళ్లడానికి తెల్లవారు జామున మద్రాసు ఎయిర్‌పోర్టులో ఉన్నాను. ఎవరో నా భుజం తట్టారు. తిరిగి చూస్తే ఖాదర్‌ ఖాన్‌. మా ఇద్దరికీ మందు పరిచయం లేదు. కానీ ఆయన నా పాత్రలు చాలా చేస్తున్నారని విన్నాను. ఆయన హార్థికంగా పలకరించి ‘నేను ఖాదర్‌ ఖాన్‌. హిందీలో మీ పాత్రలు చేస్తున్నాను’ అన్నారు. నేను పులకించాను. ‘మీరు గొప్ప నటులు, నా పాత్రలు చెయ్యడం నాకు […]

Continue Reading · 0

Gollapudi columns ~ Dudukugala (దుడుకుగల..)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

కీర్తి హెచ్చరిక. కీర్తి భయంకరమైన బాధ్యత. 24 గంటలూ కంటిమీద కునుకు లేకుండా కాపాడు కోవలసిన, దుర్మార్గమైన ఆస్తి. సజ్జనుడికి అది అలవోక. వ్యసనపరుడి మనసు ఏ మాత్రం బెసికినా– ఆమూ లాగ్రం కబళించే వికృత శక్తి. పుష్య బహుళ పంచమి. త్యాగరాజస్వామి నిర్యాణం. త్యాగరాజ ఆరాధనోత్సవాల ప్రారంభం. త్యాగరాజు ఒక అపూర్వమైన పంచరత్న కీర్త నని రచించారు–గౌళ రాగంలో –‘దుడుకుగల నన్నే దొరకొ డుకు బ్రోచురా’ అంటూ. భక్తి పారవశ్యంతో దాదాపు 200 సంవత్సరాలు ప్రాణం […]

Continue Reading · 0

Gollapudi columns ~ Modi Ki O Salahaa (మోదీకి ఓ సలహా!)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

రాహుల్‌ గాంధీ సూచనలను బొత్తిగా కొట్టిపారేయకుండా మోదీ ‘జాదూ కా జప్పీ’ని గుర్తుంచుకోవాలి. వారు విదేశాల్లోనే కాకుండా దేశంలో పర్యటించి నప్పుడు మధ్య మధ్య మామూలు మనుషుల్ని కూడా కావలించుకోవాలి. నాకు రాహుల్‌ గాంధీ అభి ప్రాయాలమీద అపారమైన విశ్వాసం ఉంది. వారు ఏ అభిప్రాయమైనా ఆచితూచి చెబుతారు. ఇప్పుడు రాహుల్, మోదీకి ఓ సలహా చెప్పారు. మోదీ టీవీలు తరచూ చూస్తారని మొన్న రాజ్యస భలో రేణుకాదేవి నవ్వుకి రామాయణాన్ని ఉదహరిం చడం ద్వారా మనకి […]

Continue Reading · 0

Gollapudi columns ~ Hanumanthuni Thoka (హనుమంతుని తోక !!.)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

ఈ మధ్య ‘హిందు త్వం’కు పట్టినంత దుర్గతి మరి దేనికీ పట్టలేదు. నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ దగ్గర్నుంచి, నవలా రచయిత్రి అరుం ధతీ రాయ్‌ దగ్గర్నుంచి, నేలబారు రాజకీయ నాయ కులు, కొందరు పాత్రి కేయుల దాకా అంతా ‘హిందుత్వా’న్ని వాడటం పేషన్‌. ఆ మధ్య దేవుడికి కనకాంబరం పువ్వులు ఎవరో అలంకరించారు. ఒకాయన అడిగాడు: ‘ఏం బాబూ.. మీరు హిందుత్వ ప్రచారకులా?’ అని. ఒక్క విషయం చెప్పుకోవాలి– మతానికీ, హిందు త్వానికీ ఎట్టి సంబంధమూ […]

Continue Reading · 0

Gollapudi columns ~ XXX (డిటర్జెంట్‌ సోప్‌)

నా ఆరోగ్య రహస్యం నేనెప్పుడూ తెలుగు ఛానల్స్‌ చూడను. అందువల్ల ముఖ్యంగా మనశ్శాంతి, అదనంగా ఆరోగ్యం కలిసివచ్చింది. కారణం ఛానల్స్‌లో జరిగేది ఎక్కువగా వ్యాపారం. సినిమాల సంగతి సరే. ఛానల్స్‌ కూడా ప్రేక్షకులకి కావాల్సిన ప్రోగ్రాంలు పంచే వ్యాపారాన్నే సాగిస్తున్నాయి. వాటిపని కేవలం అమ్మకం. మరొకపక్క ఈ వ్యాపారాన్ని జోరుగా సాగించే వ్యాపారులు -రాజకీయ నాయకులు. వారు కురిపించే వరాలు, చెప్పే నీతులు, మాట్లాడే ‘నిజాయితీ’, ‘సేవ’ వంటి మాటలు వారి నాయకత్వాన్ని బజారులో వ్యాపారంగా పెట్టిన […]

Continue Reading · 0

Gollapudi columns ~ Upasamanam (ఉపశమనం!)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

ఎండలు మండిపోతున్నాయి. వేసవికాలాన్ని తట్టుకుని భరించడానికి భగవంతుడు రెండు ఉపశమనాల్ని ఇచ్చాడు. మామిడికాయ, మల్లెపువ్వు. ఆంధ్రు డు భోజనప్రియుడు. మామిడికాయతో చెయ్యగలిగినన్ని వంటకాలు, చూపించగలిగినన్ని రుచులు మరే విధంగానూ సాధ్యంకావు. వేసవికాలంలో తలనిండా మల్లెపువ్వులు తురుముకోని ఆడపిల్ల కనిపించదు. ఇప్పుడిప్పుడు తెలుగువాడి గుండెలు మండిపోతున్నాయి. కాంగ్రెస్‌ చేసిన ఈ దుర్మార్గాన్ని, అరాచకాన్ని తట్టుకోడానికి భగవంతుడు రెండు ఉపశమనాల్ని ఇచ్చాడు. మొదటిది -అప్పుడే జరిగిపోయింది. బాధ్యతగల, ఆత్మాభిమానంగల నాయకులంతా ప్రాణంలేని ‘బొందె’ని వదిలిపోయినట్టు పార్టీని వదిలిపోయారు. ఈ నిష్క్రమణం […]

Continue Reading · 0

Gollapudi columns ~ The Beautiful Game ( ది బ్యూటిఫుల్ గేమ్)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

ప్రపంచంలో మన ప్రాంతాలలో క్రికెట్ ఒక జీవన విధానం. అదిలేని జీవితాన్ని మనం ఈ రోజుల్లో ఊహించలేం. క్రికెట్ కి ప్రత్యేకమైన ఛానళ్లు, ప్రత్యేకమైన అభిమానులూ, దానికి మాత్రమే సంబంధించిన అవినీతులూ ఈ దేశంలో వెల్లివిరుస్తున్నాయి. కాని మన దేశానికి అంతగా అర్ధంకాని, ప్రపంచ దేశాలలో ఊహించలేని ప్రాముఖ్యం ఉన్న ఆట -బంతి ఆట. ఒకే ఉదాహరణ. ప్రపంచంలో 104 దేశాలలో క్రికెట్ ఆట మోజు ఉంది. మొన్న ముగిసిన ఐపిఎల్ 7 ని ప్రపంచంలో 225 […]

Continue Reading · 0

Gollapudi columns ~ Tegipoyina Gnaapakaalu (తెగిపోయిన జ్ఞాపకాలు)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

రెండు రాష్ట్రాలుగా విడిపోయిన రెండింటిలో ఎన్నో సమస్యలు. ఎన్నో సౌకర్యాలు, మరెన్నో సర్దుబాట్లు తప్పనిసరికావచ్చు. తప్పదు. ఈ దేశం రెండుగా విడిపోయినప్పుడు -సరిహద్దుల్లో ఒక అమ్మాయి చదువుకునే బడి పొరుగుదేశంలో ఉండిపోయింది. ఆమె ప్రతీరోజూ స్కూలుకి వెళ్లిరావాలి. అంటే సరిహద్దుదాటి పొరుగుదేశానికి వెళ్లాలి. ఆమెని ఇటు ఉద్యోగులు అప్పగిస్తే అటుపక్క ఉద్యోగులు ఆమెని స్కూలు దగ్గర వదిలిపెట్టి మళ్లీ సరిహద్దుకి తీసుకువచ్చి అప్పగించేవారు. ఒకావిడ పుట్టిల్లు పొరుగు దేశంలో ఉండిపోయింది. నాకు సంబంధించినంతవరకూ నా గొప్ప జ్ఞాపకాలన్నీ […]

Continue Reading · 0

Gollapudi columns ~ Sthithapragnudu (స్థితప్రజ్ఞుడు)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

51 సంవత్సరాలుగా అక్కినేనిని అతి సమీపంగా చూస్తున్నవాడిగా, 65 సంవత్సరాలుగా ఆయన చిత్రాలని అభిమానిస్తున్నవాడిగా -అక్కినేనిలో అతి విచిత్రమైన విపర్యయాలు కనిపిస్తాయినాకు. ఆయన దేవుడిని నమ్మరు. ఆయన యింట్లో గోడలకి దేవుడి పఠాలను చూసిన గుర్తులేదు. కాని దేవుడి పాత్రల్నీ, భక్తుల పాత్రల్నీ ఆయన నటించిన తన్మయత్వం, తాదాత్మ్యం అపూర్వం. కాళిదాసు, తుకారాం, నారదుడు, విప్రనారాయణ, భక్త జయదేవ -యిలా ఎన్నయినా ఉదాహరణలు మనస్సులో కదులుతాయి. ఆయనకి బొత్తిగా నచ్చనిది -సానుభూతి. ఎక్కువగా ఆశించనిది -పొగడ్త. అమితంగా […]

Continue Reading · 0

Gollapudi columns ~ Sattaleni Dinamulu (సత్తలేని దినములు.. )

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

157 సంవత్సరాల కిందట త్యాగరాజస్వామి వాపోయిన తీరు ఇది. కలిలో ప్రథమ పాదంలోనే యిన్ని అనర్థాలు జరుగుతున్నాయన్నారు. 2014 లో ఆయా సందర్భాల విశ్వరూపాన్ని చూస్తున్నాం. ఇంకా ఇది కలిలో ప్రథమ పాదమే. గూండాలూ, రేపిస్టులూ పదవుల్లో నిలవడం, దౌర్జన్యం, బుకాయింపు రాజ్యమేలడం, నిర్భయ వంటివారి దారుణ మరణాలు, కేమ్కావంటి నీతిపరులయిన ఆఫీసర్ల శంకరగిరి తిరణాలూ… ఇంకా ఇది కలిలో మొగటి భాగమే! అయితే 157 సంవత్సరాల కిందటే ఈ మాట అనగలిగిన, అనవలసిన అరాచకాన్ని త్యాగరాజస్వామి […]

Continue Reading · 0