పద్యం:
సీ. తార్క్ష్యవాహన | నీవు – దండిదాత వటంచు
గోరి వేడుక నిన్ను – గొల్వవచ్చి
యర్థిమార్గమును నే – ననుసరించితినయ్య
లావైన బదునాల్గు – లక్ష లైన
వేషముల్ వేసి నా – విద్యాప్రగల్భత
జూపసాగితి నీకు – సుందరాంగ |
యానంద మైన నే – నడుగ వచ్చిన దిచ్చి
వాంఛ దీర్పుము – నీలవర్ణ | వేగ
తే. నీకు నావిద్య హర్షంబు – గాక యున్న
తేపతేపకు వేషముల్ – దేను సుమ్మి.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |
తాత్పర్యం:
ఓ నరసింహా!గరుడవాహనా!నీవు గొప్పదాతవని యెంచి కోరికతో నిన్ను కొలవవచ్చితిని.ఎన్నదగు ఎనుబదినాలుగలక్షల వేషముల ధరించి యాచకుడనై నా జ్ఞాన సంపదను నీకు జూపసాగితిని ఓ సుందరాంగ! నీలవర్ణశరీరా! సంతోషముతో నేనడిగిన కోరికలు తీర్చుము.నీవలెపలుమార్లు వేషములు మార్చలేను సుమా! కరుణించి నన్ను కావుము తండ్రీ!
.
Poem:
See. Taarkshyavaahana | Neevu – Damdidaata Vatamchu
Gori Veduka Ninnu – Golvavachchi
Yarthimaargamunu Ne – Nanusarimchitinayya
Laavaina Badunaalgu – Laksha Laina
Veshamul Vesi Naa – Vidyaapragalbhata
Joopasaagiti Neeku – Sumdaraamga |
Yaanamda Maina Ne – Naduga Vachchina Dichchi
Vaamca Deerpumu – Neelavarna | Vega
Te. Neeku Naavidya Harshambu – Gaaka Yunna
Tepatepaku Veshamul – Denu Summi.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |
.
see. taarkShyavaahana | neevu – daMDidaata vaTaMchu
gOri vEDuka ninnu – golvavachchi
yarthimaargamunu nE – nanusariMchitinayya
laavaina badunaalgu – lakSha laina
vEShamul vEsi naa – vidyaapragalbhata
joopasaagiti neeku – suMdaraaMga |
yaanaMda maina nE – naDuga vachchina dichchi
vaaMCa deerpumu – neelavarNa | vEga
tE. neeku naavidya harShaMbu – gaaka yunna
tEpatEpaku vEShamul – dEnu summi.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |
.
No comments yet.