Main Menu

Urvilo Naayushyamunna Paryanthambu (ఉర్విలో నాయుష్యమున్న పర్యంతంబు)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. ఉర్విలో నాయుష్య – మున్న పర్యంతంబు
మాయ సంసారంబు – మరగి నరుడు
సకల పాపములైన – సంగ్రహించును గాని
నిన్ను జేరెడి యుక్తి – నేర్వలేడు
తుదకు గాలునియొద్ది – దూత లిద్దఱు వచ్చి
గుంజుక చని వారు – గ్రుద్దుచుండ
హింస కోర్వగ లేక – యేడ్చి గంతులువేసి
దిక్కు లేదని నాల్గు – దిశలు చూడ

తే. దన్ను విడిపింప వచ్చెడి – ధన్యు డేడి
ముందు నీదాసుడై యున్న – ముక్తి గలుగు.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ స్వామీ!నరసింహాస్వామీ!భూమిపై నూకలున్నంతవరకు మనిషి మాయా సంసారమునకలవాటుపడి ఎన్ని పాపాలనైనా చేయునుగాని నిన్ను చేరే సూక్ష్మపు ఆలోచన చేయడుగదా!చివరకు ఇద్దరు యమభటులు వచ్చి యీడ్చుకొని పోయి హింసిస్తుంటే సహింపజాలని తన్ను రక్షించే ఉత్తముడెవ్వడోయని నలుదిక్కులజూచును గాని ముందుగానే నీ యందు భక్తి విశ్వాసముంచి ముక్తినొందడుగదా!
.


Poem:
See. Urvilo Naayushya – Munna Paryamtambu
Maaya Samsaarambu – Maragi Narudu
Sakala Paapamulaina – Samgrahimchunu Gaani
Ninnu Jeredi Yukti – Nervaledu
Tudaku Gaaluniyoddi – Doota Liddarxu Vachchi
Gumjuka Chani Vaaru – Grudduchumda
Himsa Korvaga Leka – Yedchi Gamtuluvesi
Dikku Ledani Naalgu – Disalu Chooda

Te. Dannu Vidipimpa Vachchedi – Dhanyu Dedi
Mumdu Needaasudai Yunna – Mukti Galugu.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. urvilO naayuShya – munna paryaMtaMbu
maaya saMsaaraMbu – maragi naruDu
sakala paapamulaina – saMgrahiMchunu gaani
ninnu jEreDi yukti – nErvalEDu
tudaku gaaluniyoddi – doota liddarxu vachchi
guMjuka chani vaaru – grudduchuMDa
hiMsa kOrvaga lEka – yEDchi gaMtuluvEsi
dikku lEdani naalgu – diSalu chooDa

tE. dannu viDipiMpa vachcheDi – dhanyu DEDi
muMdu needaasuDai yunna – mukti galugu.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.