Main Menu

Vadhanambhu Neenaama Bhajana Goruchunundu (వదనంబు నీనామ భజన గోరుచునుండు)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. వదనంబు నీనామ – భజన గోరుచునుండు
జిహ్వ నీకీర్తనల్ – సేయ గోరు
హస్తయుగ్మంబు ని – న్నర్చింప గోరును
గర్ణముల్ నీ మీది – కథలు గోరు
తనువు నీసేవయే – ఘనముగా గోరును
నయనముల్ నీదర్శ – నంబు గోరు
మూర్ధమ్ము నీపద – మ్ముల మ్రొక్కగా గోరు
నాత్మ నీదై యుండు – నరసి చూడ

తే. స్వప్నమున నైన నేవేళ – సంతతమును
బుద్ధి నీ పాదములయందు – బూనియుండు.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరసింహమూర్తీ!నా మనస్సు ఎల్లపుడు నీ నామ భజననే కోరును.నా నాలుకనిన్నెల్లప్పుడు కీర్తించుచునేయుండును. చేతులు నిన్ను ఎల్లపుడూ నిన్ను పూజించుచునేయుండును.నా చెవులు సదా నీకథలను వినాలనే కుతూహలముతో నుండును.నా శరీరము ఎల్లపుడు నిన్ను సేవించాలనే ఉబలాటముతో నుండును.నా కన్నులు నిన్నే ఎల్లపుడు దర్శించకోరుచున్నవి.నా శిరస్సు సదా నీ పాదపద్మములనే మ్రొక్కియుండవలెనని గోరుచున్నది. విచారించిచూడగా నా అత్మయే నీదై యున్నది.చివరకు కలలోనైననూ ఎల్లపుడు నిన్నే సేవించాలని నా బుధ్ధినిరంతరము కోరుతూ ఉంటుంది. కావున ఓ పరమేశ్వరా! నన్ను కావుము తండ్రీ!
.


Poem:
See. Vadanambu Neenaama – Bhajana Goruchunumdu
Jihva Neekeertanal – Seya Goru
Hastayugmambu Ni – Nnarchimpa Gorunu
Garnamul Nee Meedi – Kathalu Goru
Tanuvu Neesevaye – Ghanamugaa Gorunu
Nayanamul Needarsa – Nambu Goru
Moordhammu Neepada – Mmula Mrokkagaa Goru
Naatma Needai Yumdu – Narasi Chooda

Te. Svapnamuna Naina Nevela – Samtatamunu
Buddhi Nee Paadamulayamdu – Booniyumdu.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. vadanaMbu neenaama – bhajana gOruchunuMDu
jihva neekeertanal – sEya gOru
hastayugmaMbu ni – nnarchiMpa gOrunu
garNamul nee meedi – kathalu gOru
tanuvu neesEvayE – ghanamugaa gOrunu
nayanamul needarSa – naMbu gOru
moordhammu neepada – mmula mrokkagaa gOru
naatma needai yuMDu – narasi chooDa

tE. svapnamuna naina nEvELa – saMtatamunu
buddhi nee paadamulayaMdu – booniyuMDu.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.