పద్యం:
సీ. వసుధాస్థలంబున – వర్ణహీనుడు గాని
బహుళ దురాచార – పరుడు గాని
తడసి కాసియ్యని – ధర్మశూన్యుడు గాని
చదువనేరని మూఢ – జనుడు గాని
సకలమానవులు మె – చ్చని కృతఘ్నుడు గాని
చూడ సొంపును లేని – శుంఠ గాని
అప్రతిష్ఠలకు లో – నైన దీనుడు గాని
మొదటి కే మెఱుగని – మోటు గాని
తే. ప్రతిదినము నీదు భజనచే – బరగునట్టి
వాని కే వంక లేదయ్య – వచ్చు ముక్తి.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |
తాత్పర్యం:
ఓ నరసింహా!ఈ భూమిమీద తక్కువజాతి వాడుకాని మిక్కిలి దుర్మార్గుడుకాని,అప్రయత్నముగానైననూ దానమియ్యని ధర్మశూన్యుడుగాని,అజ్ఞానిగాని,జనులు మెచ్చని కృతఘ్నుడుకాని,సౌందర్యము లేని శుంఠగాని అవమానముల పాలైన దీనుడుకాని,ఏమీ తెలియని మోటువాడుగాని,ఎవరైననూ నిత్యము నీ భజనచేయుచుండినట్లైన వానికి ఏ కొఱతయునుండక మోక్షప్రాప్తి లభించును.
.
Poem:
See. Vasudhaasthalambuna – Varnaheenudu Gaani
Bahula Duraachaara – Parudu Gaani
Tadasi Kaasiyyani – Dharmasoonyudu Gaani
Chaduvanerani Moodha – Janudu Gaani
Sakalamaanavulu Me – Chchani Krutaghnudu Gaani
Chooda Sompunu Leni – Sumtha Gaani
Apratishthalaku Lo – Naina Deenudu Gaani
Modati Ke Merxugani – Motu Gaani
Te. Pratidinamu Needu Bhajanache – Baragunatti
Vaani Ke Vamka Ledayya – Vachchu Mukti.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |
.
see. vasudhaasthalaMbuna – varNaheenuDu gaani
bahuLa duraachaara – paruDu gaani
taDasi kaasiyyani – dharmaSoonyuDu gaani
chaduvanErani mooDha – januDu gaani
sakalamaanavulu me – chchani kRutaghnuDu gaani
chooDa soMpunu lEni – SuMTha gaani
apratiShThalaku lO – naina deenuDu gaani
modaTi kE merxugani – mOTu gaani
tE. pratidinamu needu bhajanachE – baragunaTTi
vaani kE vaMka lEdayya – vachchu mukti.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |
.
No comments yet.