Main Menu

Veamaaru Neekathal Vinuchu Nundedivaadu (వేమాఱు నీకథల్ వినుచు నుండెడివాడు)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. వేమాఱు నీకథల్ – వినుచు నుండెడివాడు
పరుల ముచ్చటమీద – భ్రాంతి పడడు
అగణితంబుగ నిన్ను – బొగడ నేర్చినవాడు
చెడ్డమాటలు నోట – జెప్పబోడు
ఆసక్తిచేత ని – న్ననుసరించెడివాడు
ధనమదాంధులవెంట – దగుల బోడు
సంతసంబున నిన్ను – స్మరణజేసెడివాడు
చెలగి నీచులపేరు – దలపబోడు

తే. నిన్ను నమ్మిన భక్తుండు – నిశ్చయముగ
గోరి చిల్లర వేల్పుల – గొల్వబోడు.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరసింహా!భక్తితో నీకథలు వినువాడు,పరుల ముచ్చటమీద ఆశపడడు.లెక్కలేనంతగా నిన్ను స్తుతించువాడు చెడు మాటలను పట్టించుకోడు.(లక్ష్య పెట్టడు).నీ భక్తి పార్వశ్యమున మునుగువాడు,గర్విష్ఠులైన ధనవంతులవెంట తిరగబోడు. భక్తితో నీ నామసంకీర్తనము చేయువాడు,నీచమైన నామములను ఉచ్చరింపడు నిన్ను మనస్ఫూర్తిగా నమ్మిన భక్తుడు చిల్లరదేవుళ్ళను చచ్చినా మ్రొక్కడు.
.


Poem:
See. Vemaarxu Neekathal – Vinuchu Numdedivaadu
Parula Muchchatameeda – Bhraamti Padadu
Aganitambuga Ninnu – Bogada Nerchinavaadu
Cheddamaatalu Nota – Jeppabodu
Aasakticheta Ni – Nnanusarimchedivaadu
Dhanamadaamdhulavemta – Dagula Bodu
Samtasambuna Ninnu – Smaranajesedivaadu
Chelagi Neechulaperu – Dalapabodu

Te. Ninnu Nammina Bhaktumdu – Nischayamuga
Gori Chillara Velpula – Golvabodu.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. vEmaarxu neekathal – vinuchu nuMDeDivaaDu
parula muchchaTameeda – bhraaMti paDaDu
agaNitaMbuga ninnu – bogaDa nErchinavaaDu
cheDDamaaTalu nOTa – jeppabODu
aasaktichEta ni – nnanusariMcheDivaaDu
dhanamadaaMdhulaveMTa – dagula bODu
saMtasaMbuna ninnu – smaraNajEseDivaaDu
chelagi neechulapEru – dalapabODu

tE. ninnu nammina bhaktuMDu – niSchayamuga
gOri chillara vElpula – golvabODu.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.