Main Menu

Takkulacetala mayadarivata (తక్కులచేఁతల మాయదారివట)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 151 ; Volume No. 5

Copper Sheet No. 27

Pallavi:Takkulacetala mayadarivata (తక్కులచేఁతల మాయదారివట)

Ragam: Varali

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

తక్కులచేఁతల మాయదారివట బొంకు-
నిక్కములు సేయనేమి నేరవా యీ నీవు

చరణములు

1.గుట్టున నూఁదిన పిల్లఁగోవి నీ రవమున
వట్టిమఁకుల నిగురు వెట్టినట
పట్టినఁ గందెడి నామై పై పులకలిగురు-
వెట్టఁగా నన్నింతసేయ బెట్ట యీ నీకు

2.పాదముచెమటనీరు పరపి దురితముల
సేదదేర నిందరిని జేసినట
మేదినీధరుఁడ నీ మేని చెమటలతావి-
నాదరించి ననుఁగాచుటరుదా యీ నీకు

3.ఆల నీ మదిఁబుట్టిన అంగజుఁడు లోకులను
చెలరేఁగి కాఁపురాలు నేయించీనట
కలసి వేంకటేశ్వర కందువరతుల నన్ను
కలకాలము నేలుట ఘనమా యీ నీకు
.


Pallavi

takkulacE@mtala mAyadArivaTa bomku-
nikkamulu sEyanEmi nEravA yI nIvu

Charanams

1.guTTuna nU@mdina pilla@mgOvi nI ravamuna
vaTTima@mkula niguru veTTinaTa
paTTina@m gamdeDi nAmai pai pulakaliguru-
veTTa@mgA nannimtasEya beTTa yI nIku

2.pAdamucemaTanIru parapi duritamula
sEdadEra nimdarini jEsinaTa
mEdinIdharu@mDa nI mEni cemaTalatAvi-
nAdarimci nanu@mgAcuTarudA yI nIku

3.ala nI madi@mbuTTina amgaju@mDu lOkulanu
celarE@mgi kA@mpurAlu nEyimcInaTa
kalasi vEmkaTESvara kamduvaratula nannu
kalakAlamu nEluTa ghanamA yI nIku
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.