Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 15 | Keerthana 90 , Volume 1
Pallavi:Akkada Naapaatluvadi (అక్కడ నాపాట్లువడి)
ARO: Pending
AVA: Pending
Ragam:Aahiri
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అక్కడ నాపాట్లువడి యిక్కడ నీపాటు పడి
కుక్కనోరి కళాసమై కొల్లఁబోయ బతుకు ॥ పల్లవి ॥
ఎండచేత నీడచేత నెల్లవాఁడు నిట్లానే
బండుబండై యెందుఁ గడపల గానక
వుండగిలి నరకాల నుడుకబోయెద మింక
వండఁ దరిగినకూరవలెనాయ బతుకు ॥ అక్క ॥
పంచమహపాతకాలబారిఁ బడి భవములఁ
దెంచి తెంచి ముడివేయ దీదీపులై
పొంచినయాసలవెంటఁ బొరలఁబోయెద మింక
దంచనున్న రోలిపిండితలఁపాయ బతుకు ॥ అక్క ॥
యీదచేత వానచేత నెల్లవాఁడు బాయని-
బాదచేత మేలెల్ల బట్టబయలై
గాదిలివేంకటపతిఁ గానఁగఁబోయెద మింక
బీదగరచినబూరెప్రియమాయ బ్రదుకు ॥ అక్క ॥
Pallavi
Akkaḍa nāpāṭluvaḍi yikkaḍa nīpāṭu paḍi
kukkanōri kaḷāsamai kollam̐bōya batuku
Charanams
1.Eṇḍacēta nīḍacēta nellavām̐ḍu niṭlānē
baṇḍubaṇḍai yendum̐ gaḍapala gānaka
vuṇḍagili narakāla nuḍukabōyeda miṅka
vaṇḍam̐ dariginakūravalenāya batuku
2.Pan̄camahapātakālabārim̐ baḍi bhavamulam̐
den̄ci ten̄ci muḍivēya dīdīpulai
pon̄cinayāsalaveṇṭam̐ boralam̐bōyeda miṅka
dan̄canunna rōlipiṇḍitalam̐pāya batuku
3.Yīdacēta vānacēta nellavām̐ḍu bāyani-
bādacēta mēlella baṭṭabayalai
gādilivēṅkaṭapatim̐ gānam̐gam̐bōyeda miṅka
bīdagaracinabūrepriyamāya braduku
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.