Main Menu

Annitiki Mulamani Hari Nemcaru (అన్నిటికి మూలమని హరి నెంచరు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.159 | Keerthana 284 , Volume 2

Pallavi:Annitiki Mulamani Hari Nemcaru (అన్నిటికి మూలమని హరి నెంచరు)
ARO: Pending
AVA: Pending

Ragam:Samantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటికి మూలమని హరి నెంచరు
పన్నిన మాయలో వారు బయలు వాఁకేరు ॥పల్లవి॥

ప్రకృతిబోనుల లోపలఁ జిక్కి జీవులు
అకట చక్కనివార మనుకొనేరు
సకలపుణ్యపాపాల సంది జన్మములవారు
వెకలి సంసారాలకే వేడుకపడేవారు    ॥అన్ని॥

కామునియేట్ల దిగఁగారేటి దేహులు
దోమటి తమబదుకే దొడ్డదనేరు
పామిడి కోరికలకు బంట్లైనవారలు
గామిడితనాలఁ దామే కర్తలమనేరు    ॥అన్ని॥

యితరలోకాలనెడి యేఁతపుమెట్ల ప్రాణులు
కతల వెూక్షమార్గము గంటిమనేరు
తతి నలమేల్మంగపతి శ్రీవేంకటేశ్వర
మతకాన నున్నవారు మారు మలసేరు   ॥అన్ని॥

Pallavi

Anniṭiki mūlamani hari nen̄caru
pannina māyalō vāru bayalu vām̐kēru

Charanams

1.Prakr̥tibōnula lōpalam̐ jikki jīvulu
akaṭa cakkanivāra manukonēru
sakalapuṇyapāpāla sandi janmamulavāru
vekali sansārālakē vēḍukapaḍēvāru

2.Kāmuniyēṭla digam̐gārēṭi dēhulu
dōmaṭi tamabadukē doḍḍadanēru
pāmiḍi kōrikalaku baṇṭlainavāralu
gāmiḍitanālam̐ dāmē kartalamanēru

3.Yitaralōkālaneḍi yēm̐tapumeṭla prāṇulu
katala veūkṣamārgamu gaṇṭimanēru
tati nalamēlmaṅgapati śrīvēṅkaṭēśvara
matakāna nunnavāru māru malasēru


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.