Main Menu

Amtaryaamee Vo Amtaryaamee (అంతర్యామీ వో అంతర్యామీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 279 | Keerthana 458 , Volume 3

Pallavi:Amtaryaamee Vo Amtaryaamee (అంతర్యామీ వో అంతర్యామీ)
ARO: Pending
AVA: Pending

Ragam:Lalitha
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంతర్యామీ వో అంతర్యామీ
బంతి నాకేమి గల్లా నా పాలివాఁడవు గావా    ॥ పల్లవి ॥

దొంతులై అన్ని యోనులాఁ దొల్లి నేఁ బుట్టేటినాఁడే
అంతరాత్మవైనవాఁడ వటు నీవేకా
ఇంతట విడిచేవా నన్నింద్రియాలఁ గట్టివేసి
పొంతఁ జూచేవిటు నాకుఁ బొత్తులకాఁపవుగా  ॥ అంత ॥

తొడరి స్వర్గనరక దుఃఖసుఖములనాఁడు
అడరి కర్మసాక్షివటు నీవేకా
విడువ వెప్పుడు నన్ను విషయాలఁ జిక్కినాఁడ
కడ నూరకుండనేల కన్నవాఁడవు గావా    ॥ అంత ॥

నీ చేతఁగానిది లేదు నీవు నాకుఁ బ్రాణమవు
కాచుటకు నీకంటే నొక్కరు వచ్చేరా
చేచేత శ్రీవేంకటేశ చేరి నీకు శరణంటి
యేచి నన్ను మన్నించితివిది నీ తేజముగాదా ॥ అంత ॥

Pallavi

Antaryāmī vō antaryāmī
banti nākēmi gallā nā pālivām̐ḍavu gāvā

Charanams

1.Dontulai anni yōnulām̐ dolli nēm̐ buṭṭēṭinām̐ḍē
antarātmavainavām̐ḍa vaṭu nīvēkā
intaṭa viḍicēvā nannindriyālam̐ gaṭṭivēsi
pontam̐ jūcēviṭu nākum̐ bottulakām̐pavugā

2.Toḍari svarganaraka duḥkhasukhamulanām̐ḍu
aḍari karmasākṣivaṭu nīvēkā
viḍuva veppuḍu nannu viṣayālam̐ jikkinām̐ḍa
kaḍa nūrakuṇḍanēla kannavām̐ḍavu gāvā

3.Nī cētam̐gānidi lēdu nīvu nākum̐ brāṇamavu
kācuṭaku nīkaṇṭē nokkaru vaccērā
cēcēta śrīvēṅkaṭēśa cēri nīku śaraṇaṇṭi
yēci nannu mannin̄citividi nī tējamugādā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.