Main Menu

Aluguta Ledu Summee (అలుగుత లేదు సుమ్మీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 154 | Keerthana 316 , Volume 7

Pallavi: Aluguta Ledu Summee (అలుగుత లేదు సుమ్మీ)
ARO: Pending
AVA: Pending

Ragam: Mukhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అలుగుత లేదు సుమ్మీ అప్పుడు నీతో
యెలమి నో రమణుఁడ యేమని వుండితివో  ॥ పల్లవి ॥

ఎదుట నీవుండఁగాను యేఁపే మరుఁడో యంటా
అదివో గుండెబెదరి అవ్వలిమోమైతి
కదిసి చేయివేయఁగాఁ గమ్మచిగురుటమ్మంటా
నుదిరిపడి వెరచి వుస్సురంటిని        ॥ అలుగు ॥

మలసి చూడఁగఁ జల్లె మంతపువెన్నెలలంటా
తొలఁగి పయ్యద నామైఁ దుడుచుకొంటి
పలికి మాటాడఁగాను పంపుడుఁ జిలుకలంటా
నిలువున వెరగంది తలవంచుకొంటివి    ॥ అలుగు ॥

కాఁగిట నీవు గూడఁగాఁ గలలోని భ్రమతలంటా
కాఁగిన కుచములతోఁ గన్నుమూసితి
సోగల నీకొనగోరి సోఁకులనిన్నీఁ దెలిసి
బాగుల శ్రీ వెంకటేశ పైకొంటివి       ॥ అలుగు ॥

Pallavi

Aluguta lēdu sum’mī appuḍu nītō
yelami nō ramaṇum̐ḍa yēmani vuṇḍitivō

Charanams

1.Eduṭa nīvuṇḍam̐gānu yēm̐pē marum̐ḍō yaṇṭā
adivō guṇḍebedari avvalimōmaiti
kadisi cēyivēyam̐gām̐ gam’maciguruṭam’maṇṭā
nudiripaḍi veraci vus’suraṇṭini

2.Malasi cūḍam̐gam̐ jalle mantapuvennelalaṇṭā
tolam̐gi payyada nāmaim̐ duḍucukoṇṭi
paliki māṭāḍam̐gānu pampuḍum̐ jilukalaṇṭā
niluvuna veragandi talavan̄cukoṇṭivi

3.Kām̐giṭa nīvu gūḍam̐gām̐ galalōni bhramatalaṇṭā
kām̐gina kucamulatōm̐ gannumūsiti
sōgala nīkonagōri sōm̐kulaninnīm̐ delisi
bāgula śrī veṅkaṭēśa paikoṇṭivi


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.