Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
కంటిమి నీగుణములు కన్నుల పండుగగాను
యింటికి నీవే వచ్చి యెచ్చరించఁగా
జంటలైతి మిద్దరము చక్కనాయఁ బనులెల్ల
వంటుచేసి న్నునెంత నమ్మించేవయ్యా ॥ అన్ని ॥
మెచ్చితి నీనేరుపులు మేనఁ బులకలు నిండ
కచ్చువెట్టి నన్ను గూడి కాఁగిలించంగా
మచ్చిక శ్రీవేంకటేశ మనసు లొక్కటులాయ
యిచ్చగించ నీ నిజాలు యెంతచెప్పేవయ్యా ॥ అన్ని ॥
No comments yet.