Main Menu

Anniyu Vedukalai Yappatiki (అన్నియు వేడుకలై యప్పటికి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 660 | Keerthana 357 , Volume 14

Pallavi: Anniyu Vedukalai Yappatiki (అన్నియు వేడుకలై యప్పటికి)
ARO: Pending
AVA: Pending

Ragam: Lalitha
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నియు వేడుకలై యప్పటికి నుండుఁగాక
యెన్నికలు వెనకముం దేకము గాకుండునా ॥ పల్లవి ॥

నిన్ను నేఁ జూచినపిప్పుడె నివ్వెరగాయ మేను
యెన్నఁగ నీవప్పుడు నన్నేమి సేసితో
పన్ని యెరఁగనివారి బలిమిఁ దడవితేను
మన్నన నాఫలము తమకు రాక మానునా   ॥ అన్ని ॥

కదిసి నీవద్దనే కళదాఁకి వున్నవేళ
యెదుట నాచెవిలోన నేమంటివో
నిదిరించే వారిని నీవెంత దిట్టినాను
మదియించి నీచెవుల మగుడక వుండునా   ॥ అన్ని ॥

తీరని నీరతివేళ దిమ్మువట్టి వుండఁగాను
యీరీతిని గురుతులేడ నించితో
చేరి నన్నుఁ గూడితివి శ్రీవేంకటేశ నీవు
కారణము నే నిన్నుఁగలయక పోదునా    ॥ అన్ని ॥

Pallavi

Anniyu vēḍukalai yappaṭiki nuṇḍum̐gāka
yennikalu venakamuṁ dēkamu gākuṇḍunā

Charanams

1.Ninnu nēm̐ jūcinapippuḍe nivveragāya mēnu
yennam̐ga nīvappuḍu nannēmi sēsitō
panni yeram̐ganivāri balimim̐ daḍavitēnu
mannana nāphalamu tamaku rāka mānunā

2.Kadisi nīvaddanē kaḷadām̐ki vunnavēḷa
yeduṭa nācevilōna nēmaṇṭivō
nidirin̄cē vārini nīventa diṭṭinānu
madiyin̄ci nīcevula maguḍaka vuṇḍunā

3.Tīrani nīrativēḷa dim’muvaṭṭi vuṇḍam̐gānu
yīrītini gurutulēḍa nin̄citō
cēri nannum̐ gūḍitivi śrīvēṅkaṭēśa nīvu
kāraṇamu nē ninnum̐galayaka pōdunā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.