Main Menu

Addo Yekkadisuddi Antesi (అద్దో యెక్కడిసుద్ది అంతేసి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1705 | Keerthana 25 , Volume 27

Pallavi: Addo Yekkadisuddi Antesi (అద్దో యెక్కడిసుద్ది అంతేసి)
ARO: Pending
AVA: Pending

Ragam: Aahiri
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Addo Yekkasuddi Antesi | అద్దో యెక్కడిసుద్ది అంతేసి     
Voice: Unknown


Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అద్దో యెక్కడి సుద్ది అంతేసి కోపఁగలనా
గద్దించ నీతో నాకుఁ బెద్దరికమా       ॥ పల్లవి ॥

చెలఁగి నీవేమి చేసినాఁ జేసితివి గాక
చలములు సాదించ సరిదాననా
సెలవుల నవ్వేవు నీ చిత్తము కొలఁది గాక
మలసి నే మారునవ్వ మందెమేళమా    ॥ అద్దో ॥

కొచ్చి కొచ్చి నీ వెంత కొంగువట్టి తీసినాను
పచ్చిదేరఁ బెనఁగ కోపపుదాననా
యెచ్చరించి సారె సారె నిక్కువ లంటేవు నీవు
గచ్చుల నేనూ నొరయఁ గండ గర్వమా    ॥ అద్దో ॥

యిక్కువ శ్రీ వేంకటేశ యేలితివంటా నేను
నిక్కి యెమ్మె సేయ నీతో నీటుదాననా
మక్కువచేసి నన్ను మన్నించితివి రతుల
అక్కరతోఁ గొసరఁగ ఆసోదమా       ॥ అద్దో ॥

Pallavi

Addō yekkaḍi suddi antēsi kōpam̐galanā
gaddin̄ca nītō nākum̐ beddarikamā

Charanams

1.Celam̐gi nīvēmi cēsinām̐ jēsitivi gāka
calamulu sādin̄ca saridānanā
selavula navvēvu nī cittamu kolam̐di gāka
malasi nē mārunavva mandemēḷamā

2.Kocci kocci nī venta koṅguvaṭṭi tīsinānu
paccidēram̐ benam̐ga kōpapudānanā
yeccarin̄ci sāre sāre nikkuva laṇṭēvu nīvu
gaccula nēnū norayam̐ gaṇḍa garvamā

3.Yikkuva śrī vēṅkaṭēśa yēlitivaṇṭā nēnu
nikki yem’me sēya nītō nīṭudānanā
makkuvacēsi nannu mannin̄citivi ratula
akkaratōm̐ gosaram̐ga āsōdamā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.