Main Menu

Amgadi Vesevu Vala (అంగడి వేసేవు వల)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 729 | Keerthana 164, Volume 16

Pallavi:Amgadi Vesevu Vala (అంగడి వేసేవు వల)
ARO: Pending
AVA: Pending

Ragam:Nata
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంగడి వేసేవు వల పదేరా వోరీ
వుంగిటి పెద్దతనాన నుండ వేఁటికయ్యా    ॥ పల్లవి ॥

ఇట్టె మరచినమాట లెచ్చరించే విది యేరా
గుట్టునఁ దలఁచుకొంటే కోప మయ్యీని
యెట్టి కేలకు నీపొందు ఇతవుగఁ జేకొంటే
మట్టు మీరి నీవోజలు మాన వేఁటికయ్యా    ॥ అంగ ॥

ఆరితేరినపనులు అణఁగ నియ్య వదేర
సారెఁ గొనఁ బెట్టఁ బోతే చల మిక్కీని
తెరుచుక నీసుద్దులు తిద్దుకొని రాఁగాను
పూరకుండి మంచితన మొల్ల వేఁటిక     ॥ అంగ ॥

ఇచ్చినకాఁగిటిలోన నీడు వెట్టే విది యేర
కుచ్చి కుచ్చి యెత్తఁబోతే గుబ్బతిల్లీని
విచ్చనవిడి నన్ను శ్రీ వేంకటేశ కూడితివి
నచ్చుల నిఁక సెలవి నవ్వు లేఁటికయ్యా    ॥ అంగ ॥


Pallavi

Aṅgaḍi vēsēvu vala padērā vōrī
vuṅgiṭi peddatanāna nuṇḍa vēm̐ṭikayyā

Charanams

1.Iṭṭe maracinamāṭa leccarin̄cē vidi yērā
guṭṭunam̐ dalam̐cukoṇṭē kōpa mayyīni
yeṭṭi kēlaku nīpondu itavugam̐ jēkoṇṭē
maṭṭu mīri nīvōjalu māna vēm̐ṭikayyā

2.Āritērinapanulu aṇam̐ga niyya vadēra
sārem̐ gonam̐ beṭṭam̐ bōtē cala mikkīni
terucuka nīsuddulu tiddukoni rām̐gānu
pūrakuṇḍi man̄citana molla vēm̐ṭika

3.Iccinakām̐giṭilōna nīḍu veṭṭē vidi yēra
kucci kucci yettam̐bōtē gubbatillīni
viccanaviḍi nannu śrī vēṅkaṭēśa kūḍitivi
naccula nim̐ka selavi navvu lēm̐ṭikayyā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.