Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
అంతటఁ గాని తీరదు ఆపెనే చేరి
చెంత లోనికి రమ్మని చే వట్టి తియ్యవయ్యా ॥ పల్లవి ॥
యిచ్చగించి నీవు నాపె యేకతము లాడఁ గాను
వచ్చి వచ్చి నిలిచెను వాకటిఁ జెలి
తుచ్చము లాడక తొల్లె తొయ్యలిచే మొక్కించి
మచ్చికగాఁ గిందుపడి మాట లాడవయ్యా ॥ అంతట ॥
చేచేతమీ రిద్దరును సెలవుల నవ్వఁ గాను
చూచి చూచి తలవంచి సోలగిలీని
యేచి కోపించకతొల్లె యింతిచే సేవ సేయించి
తాచి నీకాఁగిట నీవు తమి రేఁచవయ్యా ॥ అంతట ॥
No comments yet.