Main Menu

Anganamohamu Neepai (అంగనమోహము నీపై)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1724 | Keerthana 141 , Volume 27

Pallavi:Amgadi Anganamohamu Neepai (అంగనమోహము నీపై)
ARO: Pending
AVA: Pending

Ragam:Desalam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంగన మోహము నీపై నటువంటిదా
యింగిత మెఱఁగవా నీ వింత దొరవు      ॥పల్లవి॥

సిగ్గువడి యాపె నీతో శిరసు వంచుకుండఁగా
దగ్గర లోఁగే వదేమి దంటవాఁడవు
యెగ్గున నీ వలఁ(ల్లఁ?) దప్పు యేమైనాఁ గలదోనేఁడు
వొగ్గి నీకు ఆపె యిందు వొరటులాడీనా    ॥అంగ॥

కన్నెపాయ మటుగాన కాంత పలుకఁగ వుంటే
పన్ని యేల పైఁకొనవు ప్రౌఢవాఁడవు
యెన్నికలు యేమైనా యెంచుకొన్నవిఁగలవో
అన్నిటా నీ వేమనినా అవుఁగాదనీనా    ॥అంగ॥

నెలఁత నిన్నుఁ గలసి నివ్వెరగైయుండఁగాను
యెలయించకు శ్రీ వేంకటేశ్వరుఁడవు
అలుకదేరి కూడితి వాస లేమైనాఁ గలవో
చెలియ నీ చెప్పినట్లు సేయకమానీనా    ॥అంగ॥


Pallavi
Aṅgana mōhamu nīpai naṭuvaṇṭidā
yiṅgita meṟam̐gavā nī vinta doravu

Charanams

1.Sigguvaḍi yāpe nītō śirasu van̄cukuṇḍam̐gā
daggara lōm̐gē vadēmi daṇṭavām̐ḍavu
yegguna nī valam̐(llam̐?) Dappu yēmainām̐ galadōnēm̐ḍu
voggi nīku āpe yindu voraṭulāḍīnā

2.Kannepāya maṭugāna kānta palukam̐ga vuṇṭē
panni yēla paim̐konavu prauḍhavām̐ḍavu
yennikalu yēmainā yen̄cukonnavim̐galavō
anniṭā nī vēmaninā avum̐gādanīnā

3. Nelam̐ta ninnum̐ galasi nivveragaiyuṇḍam̐gānu
yelayin̄caku śrī vēṅkaṭēśvarum̐ḍavu
alukadēri kūḍiti vāsa lēmainām̐ galavō
celiya nī ceppinaṭlu sēyakamānīnā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.