Main Menu

Adi Lessa Telusuko (అది లెస్స తెలుసుకో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1644 | Keerthana 260 , Volume 26

Pallavi: Adi Lessa Telusuko (అది లెస్స తెలుసుకో)
ARO: Pending
AVA: Pending

Ragam:Goula
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అది లెస్స తెలుసుకో అప్పుడు విడువరాదు
వెదకి నాపైఁ జేయివేసేవు నేఁడు     ॥ పల్లవి ॥

వోపుదువా ఆపెతోను వొడ్డాఁ బెట్టా మాటలాడ
యీ పొద్దున మా ఇంటికి యెట్టు వచ్చితి
ఆఁపఁగలవా కోప మాపె నిన్ను జంకించితే
చూపుల నన్ను దప్పకచూచేవు నీవు    ॥ అది ॥

సేయనోపుదువా ఆపె చేరి బాస సేయుమంటే
యీయెడ నా చనుఁగవ యిట్టె అంటేవు
నాయానకు రాఁగలవా నమ్మనంటే ఆపెతోను
చేయిమీఁదుగా నాపై సేసలు వెట్టేవు    ॥ అది ॥

నిలువఁగనోపుదువా నేర మాపె యెంచితేను
కొలఁదిమీరఁగ నన్నుఁ గూడితివి
యెలమి నాపెకు పంతమియ్యకుండ గలవా
నలి శ్రీవేంకటేశుఁడ నవ్వేవు నాతోను    ॥ అది ॥

Pallavi

Adi les’sa telusukō appuḍu viḍuvarādu
vedaki nāpaim̐ jēyivēsēvu nēm̐ḍu

Charanams

1.Vōpuduvā āpetōnu voḍḍām̐ beṭṭā māṭalāḍa
yī podduna mā iṇṭiki yeṭṭu vacciti
ām̐pam̐galavā kōpa māpe ninnu jaṅkin̄citē
cūpula nannu dappakacūcēvu nīvu

2.Sēyanōpuduvā āpe cēri bāsa sēyumaṇṭē
yīyeḍa nā canum̐gava yiṭṭe aṇṭēvu
nāyānaku rām̐galavā nam’manaṇṭē āpetōnu
cēyimīm̐dugā nāpai sēsalu veṭṭēvu

3.Niluvam̐ganōpuduvā nēra māpe yen̄citēnu
kolam̐dimīram̐ga nannum̐ gūḍitivi
yelami nāpeku pantamiyyakuṇḍa galavā
nali śrīvēṅkaṭēśum̐ḍa navvēvu nātōnu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.