Main Menu

Adaku Boyiraavayyaa Annee (ఆడకుఁ బోయిరావయ్యా అన్నీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1653 | Keerthana 314, Volume 26

Pallavi: Adaku Boyiraavayyaa Annee (ఆడకుఁ బోయిరావయ్యా అన్నీ)
ARO: Pending
AVA: Pending

Ragam: Padi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆడకుఁ బోయిరావయ్యా అన్నీ విన్నవించేఁగాని
యీడ మాతోడి పొందులు యేకాలముఁ గలవే ॥ పల్లవి ॥

చిత్తము రంజిల్ల నీవే చెప్పినట్టల్లాఁ జేసి
మెత్తనిమాట లాడి మెప్పించె నాపె
గుత్తపు గుబ్బలు పోఁక కొప్పు నీకుఁ జక్కఁబెట్టి
చిత్తజకేళికి నిన్నుఁ జిమ్మిరేఁచె నాపె      ॥ ఆడ ॥

తనపైఁ బరాకుసేసి తమి నీకు బుట్టించి
వినయములనే దక్కఁగొనె నిన్నాపె
కొనగోలు మోవ చెక్కుఁలను జవ్వాది మెత్తి
కనుసన్న రతులకుఁ గైకొలిపె నాపె      ॥ ఆడ ॥

తెమఱఁగుకుఁ దీసి తియ్యనిమోవి యొసగి
మరిగించె నలమేలుమంగే యాపె
గరిమ శ్రీవేంకటేశ కలసితి విటు నన్ను
సరసపునవ్వులు చవిచూపె నాపె      ॥ ఆడ ॥


Pallavi

Āḍakum̐ bōyirāvayyā annī vinnavin̄cēm̐gāni
yīḍa mātōḍi pondulu yēkālamum̐ galavē

1.Cittamu ran̄jilla nīvē ceppinaṭṭallām̐ jēsi
mettanimāṭa lāḍi meppin̄ce nāpe
guttapu gubbalu pōm̐ka koppu nīkum̐ jakkam̐beṭṭi
cittajakēḷiki ninnum̐ jim’mirēm̐ce nāpe

2.Tanapaim̐ barākusēsi tami nīku buṭṭin̄ci
vinayamulanē dakkam̐gone ninnāpe
konagōlu mōva cekkum̐lanu javvādi metti
kanusanna ratulakum̐ gaikolipe nāpe

3.Temaṟam̐gukum̐ dīsi tiyyanimōvi yosagi
marigin̄ce nalamēlumaṅgē yāpe
garima śrīvēṅkaṭēśa kalasiti viṭu nannu
sarasapunavvulu cavicūpe nāpe


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.