Main Menu

Adarimchavayyaa Amgana (ఆదరించవయ్యా అంగన)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 922 | Keerthana 117, Volume 19

Pallavi: Adarimchavayyaa Amgana (ఆదరించవయ్యా అంగన)
ARO: Pending
AVA: Pending

Ragam: Bhairavi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆదరించవయ్యా అంగన నింతటనైనా
పోది వలపులు తలపోయుచున్నది    ॥పల్లవి॥

చెప్పరాని ప్రియములు చేరి మీకుఁ జెప్పఁగాను
దప్పి దేరీ మోవిమీఁద తరుణికిని
వుప్పతిల్లు సేవ నీకు వొద్దనుండి సేయఁగాను
చిప్పిలఁగఁ జెమరించె చెక్కులెల్లాను   ॥ఆద॥

ననుపులు చేసుకొని నవ్వు నీతోనవ్వఁగాను
నినుపులై నిగిడీని నిట్టూర్పులు
తనియక వీడెమిచ్చి తగ నిన్ను వేఁడుకోఁగా
వొనరెను పులకలు వొళ్ల నెల్లాను     ॥ఆద॥

కలికితనాలు చూపి కాఁగిలించు కొనఁగాను
మలసీని కోరికలు మనసునను
అలమేలుమంగ నేలి తట్టె శ్రీ వేంకటేశ
నెలకొనె వేడుకలు నిలువెల్లాను     ॥ఆద॥


Pallavi

Ādarin̄cavayyā aṅgana nintaṭanainā
pōdi valapulu talapōyucunnadi

Charanams

1.Cepparāni priyamulu cēri mīkum̐ jeppam̐gānu
dappi dērī mōvimīm̐da taruṇikini
vuppatillu sēva nīku voddanuṇḍi sēyam̐gānu
cippilam̐gam̐ jemarin̄ce cekkulellānu

2.Nanupulu cēsukoni navvu nītōnavvam̐gānu
ninupulai nigiḍīni niṭṭūrpulu
taniyaka vīḍemicci taga ninnu vēm̐ḍukōm̐gā
vonarenu pulakalu voḷla nellānu

3.Kalikitanālu cūpi kām̐gilin̄cu konam̐gānu
malasīni kōrikalu manasunanu
alamēlumaṅga nēli taṭṭe śrī vēṅkaṭēśa
nelakone vēḍukalu niluvellānu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.