Main Menu

Annisevalunu Jesee Amgana (అన్నిసేవలును జేసీ అంగన)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 921 | Keerthana 110 , Volume 19

Pallavi: Annisevalunu Jesee Amgana (అన్నిసేవలును జేసీ అంగన)
ARO: Pending
AVA: Pending

Ragam: Mangala kousika
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్ని సేవలునుఁ జేసీ అంగన నీకు
సన్నల నీతో నట్టె సరసమాడీని       ॥ పల్లవి ॥

కామించి సిగ్గులతోడ కంకణాలు గదలఁగ
వేమారుఁ బాదము లొత్తీ వెలఁది
ఆమనివలపుతోడ నంగమెల్లాఁ జెమరించ
గోమున నప్పటి నీకుఁ గొప్పువెట్టీని     ॥ అన్ని ॥

సెలవినవ్వులతోడ చెక్కిన పయ్యద జార
మలయుచు వీడెమిచ్చీ మగువ
పులకచెక్కులతోడ పొందులు తలఁపు రాఁగ
వెలయ సురటి నీకు విసరీని        ॥ అన్ని॥

నిట్టూరుపులతోడ నిండునివ్వెరగుతోడ
గుట్టున గుబ్బల నొత్తీఁ గోమలి
యిట్టె శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేఁడు
జట్టిగొని యాపె యింకా చవులు చూపీని ॥ అన్ని॥

Pallavi

Anni sēvalu jēsī aṅgana nīku
sannulu nītō naṭṭu sarasamāḍenu

Charanams

1.Kāmin̄ci siggulatōḍa kaṅkaṇālu gadalam̐ga
vēmārum̐ bādamu lottī velam̐di
āmanivalaputōḍa naṅgamellām̐ jemarin̄ca
gōmuna nappaṭi nīkum̐ goppuveṭṭīni

2.Selavinavvulatōḍa cekkina payyada jāra
malayucu vīḍemiccī maguva
pulakacekkulatōḍa pondulu talam̐pu rām̐ga
velaya suraṭi nīku visarīni

3.Niṭṭūrupulatōḍa niṇḍunivveragutōḍa
guṭṭuna gubbala nottīm̐ gōmali
yiṭṭe śrī vēṅkaṭēśa yēlitivi nannu nēm̐ḍu
jaṭṭigoni yāpe yiṅkā cavulu cūpīni


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.