Main Menu

Amdanunnachelulamu Nannitaa (అండనున్నచెలులము నన్నిటా )

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1321| Keerthana 123, Volume 23

Pallavi:Amdanunnachelulamu Nannitaa (అండనున్నచెలులము నన్నిటా )
ARO: Pending
AVA: Pending

Ragam: Bouli
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అండనున్న చెలులము నన్నిటాఁ దనిసితిమి
యెండా నీడాఁ దెలిసితి వేమిసేతువయ్యా   ॥పల్లవి॥

చెప్పినమాటలెల్లా చెవులొగ్గి వింటివి
రెప్పలెత్తి చూచితివి వొప్పుగొంటివి
దప్పిదేరె నీ యింతి దవ్వుల నీసుద్దులకే
ఇప్పుడింతకంటె నిఁకనేమి సేతువయ్యా   ॥అండ॥

కరఁగిలి వింపులను కడును లాలించితివి
శిరసూఁచుకొని సన్నసేసితివి
సరసమున నీఇంతి చినవరిమాయను
ఇరవాయ నింతకంటె నేమిసేతువయ్యా   ॥అండ॥

చేరి కాఁగిలించితివి చెక్కు చేత నొక్కితివి
గారవించి రతులనుఁగైకొంటివి
యీరీతి శ్రీవేంకటేశ యీసతి మన్ననఁ బొందె
యేరవ్వా నే లింతకంటె నేమిసేతువయ్యా  ॥అండ॥


Pallavi

Aṇḍanunna celulamu nanniṭām̐ danisitimi
yeṇḍā nīḍām̐ delisiti vēmisētuvayyā

Charanams

1.Ceppinamāṭalellā cevuloggi viṇṭivi
reppaletti cūcitivi voppugoṇṭivi
dappidēre nī yinti davvula nīsuddulakē
ippuḍintakaṇṭe nim̐kanēmi sētuvayyā

2.Karam̐gili vimpulanu kaḍunu lālin̄citivi
śirasūm̐cukoni sannasēsitivi
sarasamuna nī’inti cinavarimāyanu
iravāya nintakaṇṭe nēmisētuvayyā

3.Cēri kām̐gilin̄citivi cekku cēta nokkitivi
gāravin̄ci ratulanum̐gaikoṇṭivi
yīrīti śrīvēṅkaṭēśa yīsati mannanam̐ bonde
yēravvā nē lintakaṇṭe nēmisētuvayyā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.