Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 958 | Keerthana 334, Volume 19
Pallavi:Adaraanimaa Tadi Gurutu (ఆడరానిమా టది గుఱుతు)
ARO: Pending
AVA: Pending
Ragam:Sankarabharanam
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Adaraanimaa Tadi Gurutu | ఆడరానిమా టది గుఱుతు
Album: Private | Voice: T.P.Chakrapani
Awaiting Contributions.
ఆడరానిమా టది గుఱుతు
వేడుకతోనే విచ్చేయుమనవే ॥పల్లవి॥
కాయజకేలికిఁ గడుఁ దమకించఁగ
ఆయము లంటిన దది గుఱుతు
పాయపుఁబతికినిఁ బరిణాము చెప్పి
మోయుచుఁ దన కిటు మొక్కితిననవే ॥ఆడ॥
దప్పిమోవితో తా ననుఁ దిట్టఁగ-
నప్పుడు నవ్విన దది గుఱుతు
యిప్పుడు దనరూ పిటు దలఁచి బయలు
చిప్పిలఁ గాఁగిటఁ జేర్చితిననవే ॥ఆడ॥
పరిపరివిధములఁ బలుకలు గులుకఁగ
అరమరచి చొక్కినది గుఱుతు
పరగ శ్రీవేంకటపతి కడపలోన
సరవిఁగూడె నిఁక సమ్మతియనవే ॥ఆడ ॥
Pallavi
Āḍarānimā ṭadi guṟutu
vēḍukatōnē viccēyumanavē
Charanams
1.Kāyajakēlikim̐ gaḍum̐ damakin̄cam̐ga
āyamu laṇṭina dadi guṟutu
pāyapum̐batikinim̐ bariṇāmu ceppi
mōyucum̐ dana kiṭu mokkitinanavē
2.Dappimōvitō tā nanum̐ diṭṭam̐ga-
nappuḍu navvina dadi guṟutu
yippuḍu danarū piṭu dalam̐ci bayalu
cippilam̐ gām̐giṭam̐ jērcitinanavē
3.Pariparividhamulam̐ balukalu gulukam̐ga
aramaraci cokkinadi guṟutu
paraga śrīvēṅkaṭapati kaḍapalōna
saravim̐gūḍe nim̐ka sam’matiyanavē
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.