Main Menu

Amdukemi Padaraadaa Analela (అందుకేమి పదరాదా ఆనలేల)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 959 | Keerthana 337 , Volume 19

Pallavi:Amdukemi Padaraadaa Analela (అందుకేమి పదరాదా ఆనలేల)
ARO: Pending
AVA: Pending

Ragam: Mukhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకేమి పదరాదా ఆనలేల సతివద్ద
కందువ మగవానికిఁ గలదే కాదా       ॥ పల్లవి ॥

చెప్పకుండునా బుద్ది చేరకుండా నెవ్వరిని
యెప్పుడూ నాకెవద్దికి నేగినవేళ
అప్పుడే యందుకు నిచ్చలాడక నీవుందువా
చప్పఁజేసి యవి నేను సాగనీఁగాక      ॥ అందు ॥

చేయకుండునా ఆకె చెల్లినట్టెల్లా, నీవు
చేయూరఁ గాఁగిటిలోనఁ జిక్కినవేళ
యీయకుందువా బాస యిందరి విడుతునని
పోయినట్టెల్లా నిన్నుఁ బోనీఁగాక       ॥ అందు ॥

అనకుండునా తానె ఆకె దొడ్డదానవని
వినకుందువా నీవు వేళావేళ
అనుగు శ్రీ వేంకటేశ అలమేలుమంగ నేను
తనీయ నే నిన్నుఁ గూడి దక్కఁగొంటిఁగాక   ॥ అందు ॥


Pallavi

Andukēmi padarādā ānalēla sativadda
kanduva magavānikim̐ galadē kādā

Charanams

1.Ceppakuṇḍunā buddi cērakuṇḍā nevvarini
yeppuḍū nākevaddiki nēginavēḷa
appuḍē yanduku niccalāḍaka nīvunduvā
cappam̐jēsi yavi nēnu sāganīm̐gāka

2.Cēyakuṇḍunā āke cellinaṭṭellā, nīvu
cēyūram̐ gām̐giṭilōnam̐ jikkinavēḷa
yīyakunduvā bāsa yindari viḍutunani
pōyinaṭṭellā ninnum̐ bōnīm̐gāka

3.Anakuṇḍunā tāne āke doḍḍadānavani
vinakunduvā nīvu vēḷāvēḷa
anugu śrī vēṅkaṭēśa alamēlumaṅga nēnu
tanīya nē ninnum̐ gūḍi dakkam̐goṇṭim̐gāka


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.