Main Menu

Amduke Samtosamaaya (అందుకే సంతోసమాయ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1992 | Keerthana 487 , Volume 29

Pallavi: Amduke Samtosamaaya (అందుకే సంతోసమాయ)
ARO: Pending
AVA: Pending

Ragam: Goula
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకే సంతోసమాయ నన్నిటా నాకు
కందువ నిట్టె మమ్ముఁ గరుణించవయ్యా   ॥ పల్లవి ॥

యెచ్చటనుండి నీవు యేమేమి సేసినాను
వచ్చితివిగా నేఁడు మా వాకిటికిని
విచ్చనవిడిని నీవు వేడుకకాఁడవై వున్నా
మచ్చికతోఁ గూచుండి మాఁటలాడితివిగా   ॥ అందు ॥

కామించి నీ వెన్నెన్ని కతలఁ బొరలినాను
నామోము చూచి ఇట్టె నవ్వితిగా
వేమరు నీ చేతలు వెల్లవిరులైనాను
ఆముకొని కాఁగిలించి యాదరించితివిగా   ॥ అందు ॥

ఆసలఁ జొక్కి నీ వెంత ఆయములు గరఁగినా
సేసలెట్టి పెండ్లాడి చేకొంటివిగా
నీ సుద్ది శ్రీవేంకటేశ నిండుకొని వుండినాను
వాసితో నన్నేలి నావాఁడవైతివిగా     ॥ అందు ॥


Pallavi

Andukē santōsamāya nanniṭā nāku
kanduva niṭṭe mam’mum̐ garuṇin̄cavayyā

Charanams

1.Yeccaṭanuṇḍi nīvu yēmēmi sēsinānu
vaccitivigā nēm̐ḍu mā vākiṭikini
viccanaviḍini nīvu vēḍukakām̐ḍavai vunnā
maccikatōm̐ gūcuṇḍi mām̐ṭalāḍitivigā

2.Kāmin̄ci nī vennenni katalam̐ boralinānu
nāmōmu cūci iṭṭe navvitigā
vēmaru nī cētalu vellavirulainānu
āmukoni kām̐gilin̄ci yādarin̄citivigā

3.Āsalam̐ jokki nī venta āyamulu garam̐ginā
sēsaleṭṭi peṇḍlāḍi cēkoṇṭivigā
nī suddi śrīvēṅkaṭēśa niṇḍukoni vuṇḍinānu
vāsitō nannēli nāvām̐ḍavaitivigā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.