Main Menu

Antasesinattimeeda Intasesite (అంతసేసినట్టిమీద ఇంతసేసితే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1577 | Keerthana 400 , Volume 25

Pallavi: Antasesinattimeeda Intasesite (అంతసేసినట్టిమీద ఇంతసేసితే)
ARO: Pending
AVA: Pending

Ragam: Sourastram
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంత సేసినట్టిమీఁద ఇంతసేసితే నేమాయ
దొంతినున్న వలపులు దోమటికి రావా    ॥ పల్లవి ॥

తీపున నిందాఁకా నిన్నుఁ దిట్లు దిట్టిననోరు
చేపట్టి నీకుఁ బ్రియాలు చెప్పఁగలేదా
దాపలాన నీమీఁదఁ జాఁచి పెనఁగినచేయి
మోపుచు నొసల నీకు మొక్కనోపదా    ॥ అంత ॥

అలుకలకు గురియై అవ్వలి మోమైనమోము
పెలుచుమోపువు విందు పెట్టఁగ లేదా
మొలకపాయములను మొనచూపినచన్నులు
గిలిగింతరతులను కిందుపడనోపవా    ॥ అంత ॥

సారాసారెసణఁగుల జంకించనట్టికన్నులు
నారుకొన్న వేడుకల నవ్వఁదగదా
యీరీతి శ్రీవేంకటేశ యింతి నీవురము యెక్కె
నుపులరతులను నిన్నిట్టె మెప్పించదా   ॥ అంత ॥

Pallavi

Anta sēsinaṭṭimīm̐da intasēsitē nēmāya
dontinunna valapulu dōmaṭiki rāvā

Charanams

1.Tīpuna nindām̐kā ninnum̐ diṭlu diṭṭinanōru
cēpaṭṭi nīkum̐ briyālu ceppam̐galēdā
dāpalāna nīmīm̐dam̐ jām̐ci penam̐ginacēyi
mōpucu nosala nīku mokkanōpadā

2.Alukalaku guriyai avvali mōmainamōmu
pelucumōpuvu vindu peṭṭam̐ga lēdā
molakapāyamulanu monacūpinacannulu
giligintaratulanu kindupaḍanōpavā

3.Sārāsāresaṇam̐gula jaṅkin̄canaṭṭikannulu
nārukonna vēḍukala navvam̐dagadā
yīrīti śrīvēṅkaṭēśa yinti nīvuramu yekke
nupularatulanu ninniṭṭe meppin̄cadā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.