Main Menu

Annitaanu Vegataina Aaduvaaramu (అన్నిటాను వెగటైన ఆడువారము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1985 | Keerthana 446 , Volume 29

Pallavi: Annitaanu Vegataina Aaduvaaramu (అన్నిటాను వెగటైన ఆడువారము)
ARO: Pending
AVA: Pending

Ragam: Malavigowla
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటాను వెగటైన ఆఁడువారము
యెన్ని లేవు మా సుద్దులు యేమి సేతుమయ్యా ॥ పల్లవి ॥

మొలక నవ్వు నవ్వితే మురిపెమువలె నుండు
సొలసితే రాజసము చూపి నట్టుండు
కలికనై మాఁటాడితే గయ్యాళించి నట్టుండు
యెలమి మావోజ లివి యేమి సేతుమయ్యా   ॥ అన్ని ॥

దగ్గరఁ గూచుండితేను దంటతనమై యుండు
సిగ్గువడి వుంటే గర్వించిన యట్లుండు
వొగ్గి పెనఁగవచ్చితే వుద్దండములై నట్లుండు
యెగ్గు దప్పు లెఱఁగము యేమి సేతుమయ్యా  ॥ అన్ని॥

అదనఁ గాఁగిలించితే నారజమువలె నుండు
యెదుట నిలుచుంటేనే యెమ్మెలై యుండు
వెదకివచ్చి నన్ను శ్రీవేంకటేశ కూడితివి
ఇదవో మా కాఁపురము యేమి సేతుమయ్యా   ॥ అన్ని॥

Pallavi

Anniṭānu vegaṭaina ām̐ḍuvāramu
yenni lēvu mā suddulu yēmi sētumayyā

Charanams

1.Molaka navvu navvitē muripemuvale nuṇḍu
solasitē rājasamu cūpi naṭṭuṇḍu
kalikanai mām̐ṭāḍitē gayyāḷin̄ci naṭṭuṇḍu
yelami māvōja livi yēmi sētumayyā

2.Daggaram̐ gūcuṇḍitēnu daṇṭatanamai yuṇḍu
sigguvaḍi vuṇṭē garvin̄cina yaṭluṇḍu
voggi penam̐gavaccitē vuddaṇḍamulai naṭluṇḍu
yeggu dappu leṟam̐gamu yēmi sētumayyā

3.Adanam̐ gām̐gilin̄citē nārajamuvale nuṇḍu
yeduṭa nilucuṇṭēnē yem’melai yuṇḍu
vedakivacci nannu śrīvēṅkaṭēśa kūḍitivi
idavō mā kām̐puramu yēmi sētumayyā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.