Main Menu

Annitaa Doravayite (అన్నిటా దొరవయితే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.1940 | Keerthana 175 , Volume 29

Pallavi: Annitaa Doravayite (అన్నిటా దొరవయితే)
ARO: Pending
AVA: Pending

Ragam: Desalam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటా దొరవయితే నౌదువుగాని
విన్నవించితి నిప్పుడే వెలఁది చందములు ॥ పల్లవి ॥

సిగ్గరిపెండ్లికూఁతురు సేసవెట్టీ నిదె నీకు
వొగ్గి తలవంచవయ్యా వొద్దికతోను
కగ్గులేక యప్పటి నీకాలు దొక్కీ వేడుకతో
యెగ్గులు వట్టేవుసుమ్మీ యిందుకుఁగాను  ॥ అన్ని ॥

కలికి నీ మరఁదలు కంకణము గట్టీ నీకు
లలిఁ జేయి చాఁచవయ్యా లాలనతోను
యెలయించి సన్నలనే యెంగిలిమోవి చూపీని
మలసి దూరేవుసుమ్మీ మన్నింతువు గాని  ॥ అన్ని॥

దేవు లలమేలుమంగ తెరదీసి చెనకీని
సేవ సేయించుకోవయ్యా శ్రీవేంకటేశ
వోవరిలోనికి దీసి వురమెక్కీ నింతలోనె
యేవేళా దించేవుసుమ్మీ యిట్టె వుందువుగాని ॥ అన్ని॥

Pallavi

Anniṭā doravayitē nauduvugāni
vinnavin̄citi nippuḍē velam̐di candamulu

Charanams

1.Siggaripeṇḍlikūm̐turu sēsaveṭṭī nide nīku
voggi talavan̄cavayyā voddikatōnu
kaggulēka yappaṭi nīkālu dokkī vēḍukatō
yeggulu vaṭṭēvusum’mī yindukum̐gānu

2.Kaliki nī maram̐dalu kaṅkaṇamu gaṭṭī nīku
lalim̐ jēyi cām̐cavayyā lālanatōnu
yelayin̄ci sannalanē yeṅgilimōvi cūpīni
malasi dūrēvusum’mī mannintuvu gāni

3.Dēvu lalamēlumaṅga teradīsi cenakīni
sēva sēyin̄cukōvayyā śrīvēṅkaṭēśa
vōvarilōniki dīsi vuramekkī nintalōne
yēvēḷā din̄cēvusum’mī yiṭṭe vunduvugāni


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.