Main Menu

Adugare Yakkalaala (అడుగరే యక్కలాల)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1940 | Keerthana 177 , Volume 29

Pallavi: Adugare Yakkalaala (అడుగరే యక్కలాల)
ARO: Pending
AVA: Pending

Ragam: Kambhodi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అడుగరే యక్కలాల ఆతని మీరందరును
యెడయక నన్నుఁ గావ నిదేవేళ యనవే(రే?)   ॥ పల్లవి ॥

సన్నల నే కొసరితి సరసము లాడితి
విన్నపాలెల్లాఁ జేసితి వేడుకొంటిని
తన్ను దూరరాదు నాకు దయగలవాఁడు తాను
యెన్నిటఁ గరఁగునే యిఁకఁ దనమనసు     ॥ అడు ॥

చెలులచేఁ జెప్పించితి చేతులెత్తి మొక్కితి
తెలియఁజెప్పితి వావి తెలదీసితి
యెలమి నే వలచితి యింగిత మెఱుఁగు తాను
మలసి తా నెప్పుడిఁక మన్నించీనే నన్నును   ॥ అడు ॥

నగితిఁ దనతో నేను నమ్మిక లిప్పించుకొంటి
తగిలి కాఁగిలించితి తమిరేఁచితి
జిగి నలమేల్మంగను శ్రీవేంకటేశుఁడు తాను
తగవుతో నన్ను నేలె తా నిఁక నేమనీనే      ॥ అడు ॥

Pallavi

Aḍugarē yakkalāla ātani mīrandarunu
yeḍayaka nannum̐ gāva nidēvēḷa yanavē(rē?)

Charanams

1.Sannala nē kosariti sarasamu lāḍiti
vinnapālellām̐ jēsiti vēḍukoṇṭini
tannu dūrarādu nāku dayagalavām̐ḍu tānu
yenniṭam̐ garam̐gunē yim̐kam̐ danamanasu

2.Celulacēm̐ jeppin̄citi cētuletti mokkiti
teliyam̐jeppiti vāvi teladīsiti
yelami nē valaciti yiṅgita meṟum̐gu tānu
malasi tā neppuḍim̐ka mannin̄cīnē nannunu

3.Nagitim̐ danatō nēnu nam’mika lippin̄cukoṇṭi
tagili kām̐gilin̄citi tamirēm̐citi
jigi nalamēlmaṅganu śrīvēṅkaṭēśum̐ḍu tānu
tagavutō nannu nēle tā nim̐ka nēmanīnē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.