Main Menu

Alamelmamgane Neenu(అలమేల్మంగనే నేను )

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1935 | Keerthana 148 , Volume 29

Pallavi: Alamelmamgane Neenu (అలమేల్మంగనే నేను)
ARO: Pending
AVA: Pending

Ragam: Ramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అలమేల్మంగనే నేను ఆకె నెటువంట(టి?)దో
యెలుఁగెత్తి చెప్పవయ్యా యియ్యకొనే నేను    ॥ పల్లవి ॥

మంతనము లాడెనట మగువ యెవ్వతొ నీతో
చెంతనుండి సన్నలూనుఁ జేసెనట
యింతులెల్లాఁ జెప్పుకొనే రీ సుద్దలే వాడలోన
యెంతటిదో చూపవయ్య యెరిఁగేను నేను    ॥ అల ॥

చెట్టవట్టి తీసెనంట చెలి నీ చెక్కులు నొక్కి
గుట్టుతోడ నిన్ను వేఁడుకొనియనట
బట్టబయలాయను యీ పనులెల్లా నూరిలోను
అట్టిదానిఁ జూపవయ్య అడిగేను నేను      ॥ అల ॥

గంటిసేసెనట మోవి కాఁగిలించుకొని నిన్ను
వొంటిదే నీ పాదాలు నొత్తెనట
నంటున శ్రీవేంకటేశ నన్ను నిట్టె యేలితివి
దంటదానిఁ జూపవయ్య తగమెచ్చే నేను    ॥ అల ॥

Pallavi

Alamēlmaṅganē nēnu āke neṭuvaṇṭa(ṭi?)Dō
yelum̐getti ceppavayyā yiyyakonē nēnu

Charanams

1.Mantanamu lāḍenaṭa maguva yevvato nītō
centanuṇḍi sannalūnum̐ jēsenaṭa
yintulellām̐ jeppukonē rī suddalē vāḍalōna
yentaṭidō cūpavayya yerim̐gēnu nēnu

2.Ceṭṭavaṭṭi tīsenaṇṭa celi nī cekkulu nokki
guṭṭutōḍa ninnu vēm̐ḍukoniyanaṭa
baṭṭabayalāyanu yī panulellā nūrilōnu
aṭṭidānim̐ jūpavayya aḍigēnu nēnu

3.Gaṇṭisēsenaṭa mōvi kām̐gilin̄cukoni ninnu
voṇṭidē nī pādālu nottenaṭa
naṇṭuna śrīvēṅkaṭēśa nannu niṭṭe yēlitivi
daṇṭadānim̐ jūpavayya tagameccē nēnu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.