పద్యం:
సీ. తాపసార్చిత | నేను – పాపకర్ముడనంచు
నాకు వంకలబెట్ట – బోకుచుమ్మి
నాటికి శిక్షలు – నన్ను చేయుటకంటె
నేడు సేయుము నీవు – నేస్తమనక
అతిభయంకరులైన – యమదూతలకు నన్ను
నొప్పగింపకు మయ్య – యురగశయన |
నీ దాసులను బట్టి – నీవు దండింపంగ
వద్దు వద్దన రెంత – పెద్దలైన
తే. దండ్రివై నీవు పరపీడ – దగులజేయ
వాసిగల పేరు కపకీర్తి – వచ్చునయ్య.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |
తాత్పర్యం:
మునులచే పూజింపబడు ఓ నరశింహస్వామీ!పాపముల చేసితినని తప్పుబట్టకు స్వామీ! స్నేహమెంచక ఎప్పుడో విధించే శిక్షలు ఈనాడే విధించుము.అతిభయంకరులైన యమదూతలకు నన్ను అప్పగించకు స్వామీ!నీ సేవకులను నీవు దండించిన’వద్దు’అనే వారెవ్వరూలేరుగాని తండ్రివైయుండియూ ఇతరులచే నన్ను పీడించినచో నీకే అపకీర్తి వచ్చునో ఓ ఉరగశయనా!
.
Poem:
See. Taapasaarchita | Nenu – Paapakarmudanamchu
Naaku Vamkalabetta – Bokuchummi
Naatiki Sikshalu – Nannu Cheyutakamte
Nedu Seyumu Neevu – Nestamanaka
Atibhayamkarulaina – Yamadootalaku Nannu
Noppagimpaku Mayya – Yuragasayana |
Nee Daasulanu Batti – Neevu Damdimpamga
Vaddu Vaddana Remta – Peddalaina
Te. Damdrivai Neevu Parapeeda – Dagulajeya
Vaasigala Peru Kapakeerti – Vachchunayya.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |
.
see. taapasaarchita | nEnu – paapakarmuDanaMchu
naaku vaMkalabeTTa – bOkuchummi
naaTiki SikShalu – nannu chEyuTakaMTe
nEDu sEyumu neevu – nEstamanaka
atibhayaMkarulaina – yamadootalaku nannu
noppagiMpaku mayya – yuragaSayana |
nee daasulanu baTTi – neevu daMDiMpaMga
vaddu vaddana reMta – peddalaina
tE. daMDrivai neevu parapeeDa – dagulajEya
vaasigala pEru kapakeerti – vachchunayya.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |
.
No comments yet.