Main Menu

Aadakela Mammu Bilcheenanare (ఆడకేల మమ్ముఁ బిల్చీననరే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1449 | Keerthana 294, Volume 24

Pallavi: Aadakela Mammu Bilcheenanare (ఆడకేల మమ్ముఁ బిల్చీననరే)
ARO: Pending
AVA: Pending

Ragam: Samantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆడకేల మమ్ముఁ బిల్చీననరే వో చెలులాల
వేడుకమాటలాడ వెస మీరు చాలరా       ॥ పల్లవి ॥

కందువ నాపెఁ దాను కాఁగిలించుకుండఁగాను
చెంది సతు లెవ్వ రెట్టు సేవసేసేరు
యిందుకు రమ్మనవే యేపనులు గలిగినా
అంది సేసేయు సిగ్గరిఆఁడువారము        ॥ ఆడ ॥

మునుపుపాన్పుపైఁదాముముసుగువెట్టుకుండఁగా
యెనసి యెవ్వరు విడెమియ్యవచ్చేరు
చెనకి మావద్దికిఁ జేఇ చాఁచుమనవే
ఘనమైనర వాసివన్నె గలవారము        ॥ ఆడ ॥

మేలి మలమేల్ మంగను మెడఁగట్టుకుండఁగాను
కాలుదొక్కి యెవ్వరెట్టు కలసేరు
యేలినాఁడు శ్రీవేంకటేశుఁ డింతలోనె మమ్ము
వోలిఁ దాము) మన్నించఁగా నుండేటివారము   ॥ ఆడ ॥


Pallavi

Āḍakēla mam’mum̐ bilcīnanarē vō celulāla
vēḍukamāṭalāḍa vesa mīru cālarā

1.Kanduva nāpem̐ dānu kām̐gilin̄cukuṇḍam̐gānu
cendi satu levva reṭṭu sēvasēsēru
yinduku ram’manavē yēpanulu galiginā
andi sēsēyu siggari’ām̐ḍuvāramu

2.Munupupānpupaim̐dāmumusuguveṭṭukuṇḍam̐gā
yenasi yevvaru viḍemiyyavaccēru
cenaki māvaddikim̐ jē’i cām̐cumanavē
ghanamainara vāsivanne galavāramu

3.Mēli malamēl maṅganu meḍam̐gaṭṭukuṇḍam̐gānu
kāludokki yevvareṭṭu kalasēru
yēlinām̐ḍu śrīvēṅkaṭēśum̐ ḍintalōne mam’mu
vōlim̐ dāmu) mannin̄cam̐gā nuṇḍēṭivāramu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.