Main Menu

Aakenela Vottivettee Vadi (ఆకెనేల వొట్టివెట్టే వది)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1250 | Keerthana 296 , Volume 22

Pallavi: Aakenela Vottivettee Vadi (ఆకెనేల వొట్టివెట్టే వది)
ARO: Pending
AVA: Pending

Ragam: Tomdi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆకెనేల వొట్టువెట్టే వది దెలుపమంటాను
పైకొని నీలో నీవే భావించుకోరాదా           ॥ పల్లవి ॥

నగితే నీదేవుల నానలువెట్టేలడిగేవు
జిగిమించ మరి యేమి చెప్పమనేవు
మగఁడవు నీచేఁతలు మరేమైనాఁ గలితే
తగిలి నీలో నీవే తలఁచుకొరాదా           ॥ ఆకె ॥

నీమోము చూచితేనేల నెలఁత కొంగు వట్టేవు
నేమాన నేమి దారుకాణించుమనేవు
యేమైనా నీసుద్దులు యేకడనైనాఁ గలితే
దీమసాన నీలో నీవే తెలుసుకోరాదా          ॥ ఆకె ॥

అలమేలుమంగ నిన్ను నంటితే నేల కొంకేవు
యెలమి శ్రీవేంకటేశ యెంతొరసేవు
యిలఁ గూడితివి యింక నేపనులైనాఁ గలితే
వెలయ నీలో నీవే విచారించుకొరాదా         ॥ ఆకె ॥

Pallavi

Ākenēla voṭṭuveṭṭē vadi delupamaṇṭānu
paikoni nīlō nīvē bhāvin̄cukōrādā

Charanams

1.Nagitē nīdēvula nānaluveṭṭēlaḍigēvu
jigimin̄ca mari yēmi ceppamanēvu
magam̐ḍavu nīcēm̐talu marēmainām̐ galitē
tagili nīlō nīvē talam̐cukorādā

2.Nīmōmu cūcitēnēla nelam̐ta koṅgu vaṭṭēvu
nēmāna nēmi dārukāṇin̄cumanēvu
yēmainā nīsuddulu yēkaḍanainām̐ galitē
dīmasāna nīlō nīvē telusukōrādā

3.Alamēlumaṅga ninnu naṇṭitē nēla koṅkēvu
yelami śrīvēṅkaṭēśa yentorasēvu
yilam̐ gūḍitivi yiṅka nēpanulainām̐ galitē
velaya nīlō nīvē vicārin̄cukorādā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.