Main Menu

Ade Nee Peddarikame Annitaanu (అదె నీ పెద్దరికమే అన్నిటాను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 945 | Keerthana 256 , Volume 19

Pallavi:Ade Nee Peddarikame Annitaanu (అదె నీ పెద్దరికమే అన్నిటాను)
ARO: Pending
AVA: Pending

Ragam: Malavigowla
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అదె నీ పెద్దరికమే అన్నిటాను
పొదిగి నీ కాఁగిటిలో బుజ్జగించవయ్యా      ॥ పల్లవి ॥

బలిమిగలకాంతకు పట్టినదే పంతము
కలసి నీచెల్లుబడి గలిగితేను
యెలమి మందెమేళాన యేమి నిన్నుఁజేసీనో
వలచినాపెకును గర్వము దగునయ్యా      ॥ అదె ॥

సేసవెట్టినచెలికి సేసినదెల్లాఁ జేఁత
ఆనయిచ్చి నీవుగన ఆదరించితే
వాసితో నీచనవున వడి నేమేమాడెనో
నీసరినున్నాపెకు నిన్నేసి దగునయ్యా     ॥ అదె ॥

నెమ్మి నలమేల్మంగకు నిల్చినదే నిలుకడ
ఇమ్ముల నీవు శ్రీ వేంకటేశ కూడితే
వుమ్మడి నీరతి నెంతవొద్దిక నొరసెనో
తమ్మివిరిపై యాపె కింతయుఁ దగునయ్యా    ॥ అదె ॥

Pallavi

Ade nī peddarikamē anniṭānu
podigi nī kām̐giṭilō bujjagin̄cavayyā

Charanams

1.Balimigalakāntaku paṭṭinadē pantamu
kalasi nīcellubaḍi galigitēnu
yelami mandemēḷāna yēmi ninnum̐jēsīnō
valacināpekunu garvamu dagunayyā

2.Sēsaveṭṭinaceliki sēsinadellām̐ jēm̐ta
ānayicci nīvugana ādarin̄citē
vāsitō nīcanavuna vaḍi nēmēmāḍenō
nīsarinunnāpeku ninnēsi dagunayyā

3.Nem’mi nalamēlmaṅgaku nilcinadē nilukaḍa
im’mula nīvu śrī vēṅkaṭēśa kūḍitē
vum’maḍi nīrati nentavoddika norasenō
tam’miviripai yāpe kintayum̐ dagunayyā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.