Main Menu

Adidevudanaga Modala Navatarinchi (ఆదిదేవుడనగ మొదల నవతరించి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 63 | Keerthana 324 , Volume 1

Pallavi: Adidevudanaga Modala Navatarinchi (ఆదిదేవుడనగ మొదల నవతరించి)
ARO: Pending
AVA: Pending

Ragam:Samantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆదిదేవుఁడనఁగ మొదల నవతరించి జలది సొచ్చి
వేదములును శాస్త్రములును వెదకి తెచ్చె నీతఁడు    ॥ పల్లవి ॥

వాలి తిరుగునట్టి దైత్యవరుల మోహవతులనెల్ల
మూలమూలఁ ద్రోసి ముసుఁగుపాలు సేసె నీతఁడు
వేలంఖ్యలైనసతుల వేడుకలలరఁజేసి వొంటి
నాలిమగనిరీతిఁ గూడి యనభవించె నీతఁడు       ॥ ఆది ॥

కడుపులోని జగములెల్లఁ గదలకుండఁ బాఁపరేని-
పడుక నొక్కమనసుతోడఁ బవ్వళించె నీతఁడు
అడుగుకింద లోకమెల్ల నడఁచఁదలఁచి గుఱుతుమీర
పొడవు వెరిగి మిన్నుజలము పొడిచి తెచ్చె నీతఁడు    ॥ ఆది ॥

కోడెవయసునాఁడు మంచి గోపసతుల మనములెల్ల
ఆడి కెలకు నోప కొల్లలాడి బ్రదికె నీతఁడు
వేడుకలర వేంకటాద్రి వెలసి భూతకోటి దన్నుఁ
జూడుఁడనుచు మోక్షపదము చూరవిడిచె నీతఁడు    ॥ ఆది ॥

Pallavi

Ādidēvum̐ḍanam̐ga modala navatarin̄ci jaladi socci
vēdamulunu śāstramulunu vedaki tecce nītam̐ḍu

Charanams

1.Vāli tirugunaṭṭi daityavarula mōhavatulanella
mūlamūlam̐ drōsi musum̐gupālu sēse nītam̐ḍu
vēlaṅkhyalainasatula vēḍukalalaram̐jēsi voṇṭi
nālimaganirītim̐ gūḍi yanabhavin̄ce nītam̐ḍu

2.Kaḍupulōni jagamulellam̐ gadalakuṇḍam̐ bām̐parēni-
paḍuka nokkamanasutōḍam̐ bavvaḷin̄ce nītam̐ḍu
aḍugukinda lōkamella naḍam̐cam̐dalam̐ci guṟutumīra
poḍavu verigi minnujalamu poḍici tecce nītam̐ḍu

3.Kōḍevayasunām̐ḍu man̄ci gōpasatula manamulella
āḍi kelaku nōpa kollalāḍi bradike nītam̐ḍu
vēḍukalara vēṅkaṭādri velasi bhūtakōṭi dannum̐
jūḍum̐ḍanucu mōkṣapadamu cūraviḍice nītam̐ḍu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.