Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
ఐతేనేమి దోసము అపరాధమేమి నీకు
కాతరము గలిగిన ఘనుఁడవు నీవు ॥ పల్లవి ॥
పుక్కిటఁ బోసిన యట్టిబుద్దులు నీకవి సుమ్మీ
తక్కక ఆకెవెట్టిన తమ్ములము
అక్కడ నీకు నేను ఆకుమడిచియ్యలేదు
యెక్కడనుండి వచ్చెనో యేల లేదనేవు ॥ ఐతే ॥
వుంకువిచ్చి కైకొన్నవొగి సంచకారుసుమ్మీ
అంకెల నీకొనవేలి ఆవుంగరము
పొంకాన నే మెన్నఁడు పూఁచి యిచ్చినది లేదు
లంకెఁ బెట్టుకొంటివి పల్లదా లేలాడేవు ॥ ఐతే ॥
వుమ్మడి నాపె వెట్టిన వొరపు వలపు సుమ్మీ
కమ్మి కాఁగిటనంటిన గందము నీకు
నెమ్మది శ్రీ వేంకటేశ నీవు నన్నుఁ గూడితివి
అమ్మకోఁ నే నెఱఁగని వానలేల పట్టేవు ॥ ఐతే ॥
No comments yet.