Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 28 | Keerthana 160 , Volume 5
Pallavi: Alamelumamga Neevabhinavaruupamu (అలమేలుమంగ నీవభినవరూపము)
ARO: Pending
AVA: Pending
Ragam: Padi
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అలమేలుమంగ నీవభినవరూపము
జలజాక్షుకన్నులకు చవులిచ్చేవమ్మా ॥ పల్లవి ॥
గరుడాచలాధీశు ఘన వక్షమున నుండి
పరమానందసంభరితవై
నెరతనములు చూపి నిరంతరము నాథుని
హరుషించఁగఁ జేసితి గదవమ్మా ॥ అల ॥
శశికిరణములకు చలువల చూపులు
విశదముగా మీఁద వెదచల్లుచు
రసికత పెంపునఁ గరఁగించి యెప్పుడు నీ –
వశము చేసుకొంటి వల్ల భునోయమ్మా ॥ అల ॥
రట్టడి శ్రీ వేంకటరాయనికి నీవు
పట్టపురాణివై పరఁగుచు
వట్టిమాఁకులిగిరించు వలపుమాటల విభు
జట్టిగొని వురమున సతమైతివమ్మా ॥ అల ॥
Pallavi
alamElumaMga nIvabhinavarUpamu
jalajAkShukannulaku chavulichchEvammA
Charanams
1.garuDAchalAdhISu ghana vakShamuna nuMDi
paramAnaMdasaMbhiratavai
neratanamulu chUpi niraMtaramu nAthuni
haruShiMchaga jEsiti gadavammA
2.SaSikiraNamulaku chaluvala chUpulu
viSadamugA mIda vedachalluchu
rasikata peMpuna garagiMchi yeppuDu nI
vaSamu chEsukoMTi valla bhunOyammA
3.raTTaDi SrI vEMkaTarAyaniki nIvu
paTTapurAnivai paraguchu
vaTTimAkuligiriMchu valapumATala vibhu
jaTTigoni vuramuna satamaitivammA
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.