Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 722 | Keerthana 125 , Volume 16
Pallavi: Alayumchakure Nannu Namdanunna (అలయుంచకురే నన్ను నండనున్న)
ARO: Pending
AVA: Pending
Ragam:Kannadagoula
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అలయించకురే నన్ను నండనున్న చెలులాల
చెలువుఁ డీడకుఁ దా విచ్చేసు దాఁకాను ॥ పల్లవి ॥
మనసెక్కడనో వుంది మాటలఁ బెట్టకురే
ఘనుఁడు నారమణునిఁ గన్న దాఁకాను
తను వెక్కడనో వుంది దగ్గరి పిసుకకురే
గొనకొని యాతఁడు నేఁగడుదాఁకాను ॥ అల ॥
నగ వెక్కడనో వుంది నను వేగిరించకురే
మొగి నాతని నాచెయి మోచుదాఁకాను
పగ టెక్కడనో వుంది బలిమి సేయకురే
జిగి నాతఁడు నా చేతఁ జిక్కుదాఁకాను ॥ అల ॥
పాయ మెక్కడవో వుంది భ్రమలఁ బెట్టుకురే
యీయడ నాతఁడు మంచ మెక్కుదాఁకాను
పాయక శ్రీవేంకటాద్రిపతి నన్ను నిటు గూడె
మోయనాడకురే వీని మొక్కించుదాఁకాను ॥ అల ॥
Pallavi
Alayin̄cakurē nannu naṇḍanunna celulāla
celuvum̐ ḍīḍakum̐ dā viccēsu dām̐kānu
Charanams
1.Manasekkaḍanō vundi māṭalam̐ beṭṭakurē
ghanum̐ḍu nāramaṇunim̐ ganna dām̐kānu
tanu vekkaḍanō vundi daggari pisukakurē
gonakoni yātam̐ḍu nēm̐gaḍudām̐kānu
2.Naga vekkaḍanō vundi nanu vēgirin̄cakurē
mogi nātani nāceyi mōcudām̐kānu
paga ṭekkaḍanō vundi balimi sēyakurē
jigi nātam̐ḍu nā cētam̐ jikkudām̐kānu
3.Pāya mekkaḍavō vundi bhramalam̐ beṭṭukurē
yīyaḍa nātam̐ḍu man̄ca mekkudām̐kānu
pāyaka śrīvēṅkaṭādripati nannu niṭu gūḍe
mōyanāḍakurē vīni mokkin̄cudām̐kānu
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.