Main Menu

Amdu Kamtinate Nee Yamdamu (అందు కంటినటే నీ యందము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1436 | Keerthana 213 , Volume 24

Pallavi: Amdu Kamtinate Nee Yamdamu (అందు కంటినటే నీ యందము)

ARO: Pending
AVA: Pending

Ragam:Samantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందు కంటినటే నీ యందము లెంచితిఁ గాక
చిందేటి నా మోహము నీచేతఁ జిక్కెఁ గదరా   ॥ పల్లవి ॥

నడుము పిడికెఁడంత నాతి నీకుచములైతే
బడి నొకటే పట్టెఁడంత
యెడ నాయంగము లివి యెంతలెంతలైనాను
చిడుముడి నిన్నయు నీచేతిలోనేకదరా    ॥ అందు ॥

మొగము గొడిఁదెఁడంత మోహనపుఁగనుదోయి
చిగురుఁబో డిదియేమే చేరఁడంత
యెగసక్కె మిఁకనేల యేర నే నెట్టుంటినాను
జిగి నాసింగారము నీచేతిలోనేకదరా     ॥ అందు ॥

సుదతి నీయడుగులు జుట్టెఁడంత, దేహమైతే
సదరమైనయేడు జానలంత
కదిసితి విదె శ్రీవేంకటపతి విటు నన్ను
చెదరని నేను నీచేతిలోనే కదరా        ॥ అందు ॥


Pallavi

Andu kaṇṭinaṭē nī yandamu len̄citim̐ gāka
cindēṭi nā mōhamu nīcētam̐ jikkem̐ gadarā

Charanams

1.Naḍumu piḍikem̐ḍanta nāti nīkucamulaitē
baḍi nokaṭē paṭṭem̐ḍanta
yeḍa nāyaṅgamu livi yentalentalainānu
ciḍumuḍi ninnayu nīcētilōnēkadarā

2.Mogamu goḍim̐dem̐ḍanta mōhanapum̐ganudōyi
cigurum̐bō ḍidiyēmē cēram̐ḍanta
yegasakke mim̐kanēla yēra nē neṭṭuṇṭinānu
jigi nāsiṅgāramu nīcētilōnēkadarā

3.Sudati nīyaḍugulu juṭṭem̐ḍanta, dēhamaitē
sadaramainayēḍu jānalanta
kadisiti vide śrīvēṅkaṭapati viṭu nannu
cedarani nēnu nīcētilōnē kadarā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.