Main Menu

Amduku Nimduku Bati (అందుకు నిందుకుఁ బతి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1008 | Keerthana 45 , Volume 20

Pallavi:Amduku Nimduku Bati (అందుకు నిందుకుఁ బతి)
ARO: Pending
AVA: Pending

Ragam:Padi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకు నిందుకుఁ బతి ఆయఁగదరా
నందకధరుఁడ నేఁడు నవ్వువచ్చీ నాకు      ॥ పల్లవి ॥

పిన్నదాననై బొమ్మపెండ్లి నేఁ జేయఁగాను
నన్నుఁ జూచి నీవు నాఁడే నవ్వితివిగదరా
చెన్నుగ నాకిట్టె సన్న సేసి నీవు గూడఁగాను
నన్ను నిన్నుఁ జూచి నేఁడు నవ్వు వచ్చీ నాకు ॥ అందు ॥

పడుచులు నేను చెట్టాపట్టాలు పట్టు కాడఁగా
నడుమనే నన్నుఁ జూచి నవ్వితివి గదరా
చిడుముడి నీవు నన్నుఁ జెట్టివట్టుకోఁగా నేఁడు
నడుకొత్తి నిన్నుఁ జూచి నవ్వువచ్చీ నాకు    ॥ అందు ॥

పొలసి గుజ్జనఁగూళ్ల బువ్వాలాడే నన్నుఁ జూచి
నలువంక నాఁడు నీవు నవ్వితివి గదరా
యెలమి శ్రీవేంకటేశ యిటు నా మోవిబువ్వము
నలి నీ వంటి కూడఁగా నవ్వువచ్చీ నాకు    ॥ అందు ॥


Pallavi

Anduku nindukum̐ bati āyam̐gadarā
nandakadharum̐ḍa nēm̐ḍu navvuvaccī nāku

Charanams

1.Pinnadānanai bom’mapeṇḍli nēm̐ jēyam̐gānu
nannum̐ jūci nīvu nām̐ḍē navvitivigadarā
cennuga nākiṭṭe sanna sēsi nīvu gūḍam̐gānu
nannu ninnum̐ jūci nēm̐ḍu navvu vaccī nāku

2.Paḍuculu nēnu ceṭṭāpaṭṭālu paṭṭu kāḍam̐gā
naḍumanē nannum̐ jūci navvitivi gadarā
ciḍumuḍi nīvu nannum̐ jeṭṭivaṭṭukōm̐gā nēm̐ḍu
naḍukotti ninnum̐ jūci navvuvaccī nāku

3.Polasi gujjanam̐gūḷla buvvālāḍē nannum̐ jūci
naluvaṅka nām̐ḍu nīvu navvitivi gadarā
yelami śrīvēṅkaṭēśa yiṭu nā mōvibuvvamu
nali nī vaṇṭi kūḍam̐gā navvuvaccī nāku


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.